వైరల్ వీడియో: 6 బంతులలో 6 సిక్సర్లు బాదిన పొలర్డ్..!

బుధవారం రోజు కూలిడ్జ్ క్రికెట్ గ్రౌండ్ లో వెస్టిండీస్, శ్రీలంక జట్ల మధ్య టీ20 మ్యాచ్ జరిగింది.అయితే ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ కెప్టెన్, విధ్వంసకర బ్యాట్స్ మ్యాన్ అయిన కీరన్‌ పోలార్డ్ ఒకే ఓవర్ లో ఆరు సిక్సర్లు కొట్టి ఆశ్చర్యపరిచారు.

 Viral Video Pollard Hits 6 Sixes In 6 Balls-TeluguStop.com

ఈ తాజా ఫీట్ తో ఆయన టీ 20 కేటగిరిలో ఒకే ఓవర్ లో 6 సిక్సర్లు కొట్టిన రెండో ఆటగాడిగా నిలిచారు.అలాగే అంతర్జాతీయ క్రికెట్ ఫార్మాట్ లో మూడవ ఆటగాడిగా నిలిచారు.

నిన్న జరిగిన టీ 20 మ్యాచ్ లో శ్రీలంకన్ ఆఫ్ స్పిన్నర్ అయిన అఖిల ధనంజయ వరుసగా మూడు వెస్టిండీస్ వికెట్లు పడగొట్టి తన హ్యాట్రిక్ ని బీభత్సంగా సెలబ్రేట్ చేసుకున్నాడు.

 Viral Video Pollard Hits 6 Sixes In 6 Balls-వైరల్ వీడియో: 6 బంతులలో 6 సిక్సర్లు బాదిన పొలర్డ్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ నేపథ్యంలోనే అఖిల ధనంజయ 6వ ఓవర్ వేయడం ప్రారంభించాడు.

ఐతే ఆ బంతులన్నిటిని వెస్టిండీస్ కెప్టెన్ కీరన్‌ పోలార్డ్ అనూహ్యంగా సిక్సులు బాది బౌలర్ కి ఝలక్ ఇచ్చాడు.దీంతో వెస్టిండీస్ అభిమానులు కూడా ఒక్కసారిగా సెలబ్రేషన్స్ చేసుకున్నారు.

మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేయగలిగింది.అయితే 132 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ టీం కేవలం 13 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ఘన విజయం సాధించింది.

కీరన్‌ పోలార్డ్ 11 బంతుల్లో 38 పరుగులు చేశాడు.ఈ మ్యాచ్ లో ఆయన కొట్టిన సిక్సులు హైలెట్ అయ్యాయి.

ఇకపోతే 2007 వరల్డ్ కప్ మ్యాచ్ లో నెదర్లాండ్స్ టీమ్ పై దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మన్‌ హర్ష్‌లీగిబ్స్‌ తొలిసారిగా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టి రికార్డు సృష్టించారు.అతని తర్వాత టీమ్‌ ఇండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ 2007 t20 వరల్డ్ కప్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై ఒకే ఓవర్ లో ఆరు సిక్సర్లు బాది చరిత్ర సృష్టించారు.

#Viral Video #Six Balls #Srilanka Team #Indian Team #Poland

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు