వైరల్ వీడియో: పోలిసుల వాటర్‌ కేనన్లను ఉద్యమకారకుడు..!  

తాజాగా వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు.ఇందులో భాగంగా ఓ నిరసనకారుడు పోలీసులను అడ్డుకున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

TeluguStop.com - Viral Video Police Water Cannons Activist

ఆ వీడియోలో ఓ నిరసనకారుడు పోలీసులు నిరసనకారులని చెల్లాచెదురు చేయడానికి ఉపయోగించే వాటర్ కేన్లను అడ్డుకున్నాడు.తాజాగా పార్లమెంటులో ఆమోదించిన మూడు వ్యవసాయ మార్కెటింగ్ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతులు, వారితో పాటు కొన్ని రాజకీయ పార్టీలు వీధులల్లోకి రావడంతో పలు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసనలు సాగాయి.

రైతు వ్యతిరేకతగా భావించిన బిల్లులకు అసమ్మతి వ్యక్తపరచడానికి అనేక యూనియన్లు భారత్ బంద్ పిలుపులో భాగంగా పలు ప్రాంతాల్లో రైతులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు.ఇందులో భాగంగా పంజాబ్ రాష్ట్రంలో ఈ నిరసన పెద్ద ఎత్తున జరిగింది.

TeluguStop.com - వైరల్ వీడియో: పోలిసుల వాటర్‌ కేనన్లను ఉద్యమకారకుడు..-General-Telugu-Telugu Tollywood Photo Image

ప్రభుత్వం చేసిన చట్టాల మూడు బిల్లులు ఆధారంగా వర్తించవని నిర్ధారించడానికి పంజాబ్ మొత్తాన్ని వ్యవసాయ ఉత్పత్తుల కోసం ప్రధాన మార్కెట్ యార్డ్ గా ప్రకటించాలని పంజాబ్ రాష్ట్ర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.ఇందుకోసం పంజాబ్ రాష్ట్రంలోని ప్రజలు అనేక రహదారులను అడ్డుకున్నారు.

ఇందులో భాగంగానే రైతులు దేశ రాజధానిలోకి వెళ్లడానికి ప్రయత్నం చేయగా ఢిల్లీ-ఉత్తర ప్రదేశ్ సరిహద్దులలో వేల సంఖ్యలో రైతులను పోలీసులు ఆపివేశారు.దీంతో హైవేలలో పెద్దఎత్తున ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది.

ఇందులో భాగంగానే నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయువు వాటర్ క్యాన్లను ఉపయోగించారు.పోలీసులు పెద్ద ఎత్తున మోహరించిన కూడా పంజాబ్ రైతులు ఢిల్లీ నుంచి కదిలేదిలేదంటూ స్పష్టం చేశారు.

ఇందులో భాగంగానే రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో పరిస్థితి రణరంగాన్ని తలపించింది.ఈ ఘటనలో భాగంగా ఓ యువకుడు పోలీసులు ఉపయోగిస్తున్న వాటర్ కేన్ల పైకి ఎక్కి పోలీసలను అడ్డుకునే ప్రయత్నం చేశాడు.ఆ వ్యక్తి వాటర్ కేన్ నుంచి రోడ్డుపై వెళ్తున్న వాహనంలోకి దూకడంతో అందరూ ఒక్కసారిగా భయబ్రాంతులకు లోనయ్యారు.కానీ ఆ నిరసనకారుడు సురక్షితంగానే ఉండడంతో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు.

#Punjab State #Viral Video #Soical Media #Police Officers #Youngster

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

Viral Video Police Water Cannons Activist Related Telugu News,Photos/Pics,Images..