వైరల్ వీడియో...నడిరోడ్డు మీద దంపతులను షూట్ చేసిన పోలీస్

ప్రస్తుతం ప్రపంచంలో సోషల్ మీడియా హవా నడుస్తోంది.మనుషులతో మాట్లాడటం కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ సమయం గడుపుతున్న పరిస్థితి ఉంది.

 Viral Video Police Shots Couple On Road-TeluguStop.com

సాంకేతిక విప్లవం స్వాగతించాల్సిన విషయం అయినప్పటికీ దీని వల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో నష్టాలు కూడా అన్నే ఉన్నాయి.ఎందుకంటే సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేయొచ్చు.

అక్కడ అడ్డుపడే విషయం ఏమీ ఉండదు.ముఖ్యంగా వీడియోల విషయంలో సోషల్ మీడియాలో చాలా గందరగోళం కొనసాగుతూ ఉంటుంది.

 Viral Video Police Shots Couple On Road-వైరల్ వీడియో…నడిరోడ్డు మీద దంపతులను షూట్ చేసిన పోలీస్-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఏది నిజమో ఏది అబద్దమో తెలుసుకునే అవకాశం ఉండదు.కాబట్టి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రతి వీడియో నిజంగా జరిగిందని నమ్మే అవకాశం ఎక్కువ.

అయితే చాలా సార్లు కొన్ని వీడియోలు వైరల్ అయిన తరువాత అవి ఫేక్ అని తెలిసి నాలుక కొరుక్కున్న సందర్భాలు మనం చాలా చూసాం.అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో పెద్ద ఎత్తున వైరల్ గా మారుతోంది.

ఓ పోలీస్ కానిస్టేబుల్ నడి రోడ్డు మీద ఓ వ్యక్తిని గన్ తో కాల్చివేయడం, వెంటనే అతనితో ఉన్న యువతి వద్దని ఎంత ప్రాధేయపడినా వినకపోవడం, అంతేకాక ఆ కానిస్టేబుల్ ఆ సదరు యువతిని కూడా కాల్చివేయడంతో ఇద్దరు విగతజీవులుగా ఆ ఇద్దరు నడిరోడ్డు మీద పడి ఉన్నారు.అందరూ చూస్తున్నా కూడా ఎవరూ ఆపలేకపోయారు.

ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారుతోంది.అయితే అసలు ట్విస్ట్ ఏంటంటే ఓ వెబ్ సిరీస్ నిమిత్తం షూటింగ్ కోసం తీసిన వీడియో ఇది.కాని నెటిజన్లు ఇది నిజమని నమ్మడంతో ఇది వైరల్ వీడియోగా మారింది.

#ViralVideo #Netizens #ViralVideo #WebSeries #Viral Video

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు