ఈ మధ్య రైలు పట్టాలపై అనుకోకుండా కాలుజారి పడుతున్నప్పుడు పోలీసులు కాపాడే ఘటనలు చాలానే చోటుచేసుకున్నాయి.తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరింగింది.
మహారాష్ట్ర రాజధాని ముంబైలోని దాదర్ రైల్వే స్టేషన్‌లో ఓ మహిళకు తృటిలో ప్రాణాపాయం తప్పింది.అకస్మాత్తుగా రైలు ముందు దూకిన మహిళను పోలీసులు కాపాడారు.
ఓ కేసులో నిందితురాలిగా మహిళను విచారణ నిమిత్తం ఒక మహిళా కానిస్టేబుల్, మరో మేల్ కానిస్టేబుల్ కస్టడీలో ఒక ఏరియా నుంచి మరో ఏరియాకు తీసుకెళ్తున్నారు.దాదర్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న తర్వాత మేల్ కానిస్టేబుల్ ముందు నడుస్తుండగా మహిళా కానిస్టేబుల్ నిందితురాలిని పట్టుకుని వెనుకాలే వస్తున్నది.
సరిగ్గా అప్పుడే ఎదురుగా లోకల్ రైలు వస్తుండటం గమనించిన నిందితురాలు ఒక్కసారిగా మహిళా కానిస్టేబుల్‌ను విదిలించుకుని రైలు పట్టాలపై దూకేసింది.వెంటనే గమనించిన మేల్ కానిస్టేబుల్ ప్రాణాలకు తెగించి రైల్వే ట్రాక్‌పై దూకి నిందితురాలిని రక్షించారు.
కాగా, ఉన్నట్టుండి మహిళ ఒకేసారి రైలు ముందు దూకడంతో రైల్వేస్టేషన్‌లో కలకలం చెలరేగింది.ఘటనకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి.
ఇటీవల ముంబయిలోని వాంగని రైల్వే స్టేషన్ లో పట్టాలపై పడిపోయిన చిన్నారిని ప్రాణాలకు తెగించి కాపాడిన రైల్వే ఉద్యోగి మయూర్ షెల్కేపై జాతీయస్థాయిలో ప్రశంసల వర్షం కురుస్తోంది.
రైల్వే శాఖలో పాయింట్స్ మన్ గా పనిచేస్తున్న మయూర్ షెల్కేను రైల్వే శాఖ ఉన్నతాధికారులు స్వయంగా అభినందించడమే కాకుండా, రూ.50 వేల నగదు బహుమతి కూడా అందించారు.తాజాగా, ఈ రియల్ హీరోకు మరో బంపర్ గిఫ్ట్ లభించింది.
జావా మోటార్ సైకిల్స్ సంస్థ ఓ జావా బైక్ ను కానుకగా అందించింది.షెల్కే వీరోచిత చర్య తర్వాత జావా మోటార్ సైకిల్స్ సంస్థ సహ వ్యవస్థాపకుడు అనుపమ్ తరేజా ఓ బైక్ ఇస్తానని ప్రకటించారు.
చెప్పినట్టుగానే జావా 42 మోడల్ బైక్ ను అతడికి ప్రదానం చేశారు.