వైరల్ వీడియో: మంటల్లో చిక్కుకున్న పిల్లలను సాహసంతో రక్షించిన వ్యక్తులు..!

కొన్ని సందర్భాల్లో అనుకోకూండా అగ్ని ప్రమాదాలు సంభవిస్తూ ఉండడం మనం గమనిస్తూనే ఉంటాం.తాజాగా రష్యాలో ఒక అపార్ట్మెంట్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

 Viral Video: People Who Bravely Rescued Children Trapped In Fires, Russia Men,cl-TeluguStop.com

ఈ క్రమంలో అపార్ట్మెంట్ లో నివసిస్తున్న ఒక ఇంట్లో మంటలలో చిక్కుకొన్న పోయిన ముగ్గురు పిల్లలను రక్షించడానికి ముగ్గురు వ్యక్తులు డ్రెయిన్ పైపు ద్వారా సహాయ చర్యలు చేపట్టారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతోంది.

ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.రష్యాలోని వెనిజియా జిల్లాలో ఒక అపార్ట్మెంట్ లో అకస్మాత్తుగా 62వ ఇంట్లో వంటలు వ్యాపించాయి.ముందుగా మంచానికి నిప్పు అంటుకొని, ఆ తర్వాత ఇల్లంతా వ్యాపించినట్లు సమాచారం.ఆ మంటల్లో చిక్కుకున్న పిల్లలు రక్షించేందుకు మొదటగా ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లడానికి ప్రయత్నించగా అది విఫలం అవడంతో కిటికీ ద్వారా పిల్లలను రక్షించాలని అగ్నిమాపక సిబ్బంది సూచించగా.

ముగ్గురు వ్యక్తులు సాహసం చేసి మూడవ అంతస్తు వరకు డ్రెయిన్ పైప్ సహాయంతో సంఘటన ప్రదేశానికి మెల్లగా వెళ్లిపోయారు.అయితే మరో ఇద్దరు సహాయం చేసే కోసం మెట్ల మీద వేచి ఉండి సదా సహాయక చర్యలు చేపట్టారు.

అయితే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని ముందుగా పిల్లలు సురక్షితంగా దించారు.అయితే ఆ సమయంలో పిల్లల తల్లిదండ్రులు పని మీద బయటకు వెళ్లినట్లు సమాచారం.ఇది ఇలా ఉండగా మరోవైపు ఆ ప్రాంతీయ ప్రధాన కార్యాలయం అపార్ట్మెంట్లోని అగ్ని నిరోధక వ్యవస్థలు నిర్లక్ష్యం యొక్క సంభావ్యతపై దర్యాప్తు మొదలుపెట్టారు.ఇది ఇలా ఉండగా ఆ ముగ్గురు పిల్లల్ని సురక్షితంగా ధైర్యంగా రక్షించిన ముగ్గురు వ్యక్తులపై అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వైరల్ వీడియో చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube