వైరల్ వీడియో.. డ్రెస్సింగ్ రూంలో పాకిస్తాన్ ప్లేయర్స్ గొడవ..

Viral Video Pakistan Players Clash In The Dressing Room

బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో ఆడుతోంది పాకిస్తాన్. అయితే పాక్ జట్టులోని బాబర్ ఆజం, ఇమామ్ ఉల్ హక్ మధ్య గొడవ తలెత్తింది.గేమ్ విషయంలో వీరిద్దరి మధ్య వాగ్వాదం తలెత్తింది.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరలవుతోంది.అయితే ఆటలో ఫన్నీగా గొడవపడుతూ ఓ వీడియోను వారు పంచుకున్నారు.వర్షం కారణంగా రెండో టెస్టులో భాగంగా రెండో రోజు, మూడో రోజు మ్యాచ్ రద్దయింది.

 Viral Video Pakistan Players Clash In The Dressing Room-TeluguStop.com

ఇక గ్రౌండ్‌లో ఆడటం కుదరలేదు.దీంతో డ్రెస్సింగ్ రూంలో ఆటను స్టార్ట్ చేశారు.

ఈ టైంలో ఇమామ్ ఉల్ హక్ కి బాబర్ ఆజం బాల్ వేశాడు.ఆ బాల్ కు ఇమాం అవుటయ్యాడని అనుకున్నాడు బాబర్.

 Viral Video Pakistan Players Clash In The Dressing Room-వైరల్ వీడియో.. డ్రెస్సింగ్ రూంలో పాకిస్తాన్ ప్లేయర్స్ గొడవ..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక గల్లీ క్రికెటర్స్ మాదిరిగా వీరి మధ్య గొడవ మొదలైంది.తాను అవుట్ కాలేదని వాదించసాగాడు ఇమాం.

డ్రెస్సింగ్ రూమ్‌లో బాబర్ 10 వికెట్లను పడగొట్టాడు.అయితే పాకిస్తాన్ టీం సరదాగా ఆటాడుతూ గొడవ పడిన ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది.

వర్షం కారణంగా రెండో రోజు, మూడో రోజు ఆట రద్దు కావడంతో నాలుగో రోజు మంగళవారం వర్షం గ్యాప్ ఇవ్వడంతో ఆట మొదలుపెట్టారు.మనకు సమాచారం అందిన సమయానికి పాకిస్తాన్ 298 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది.

అబిద్ అలీ 39 రన్స్ చేయగా, అబ్దుల్లా షఫీక్ 25 పరుగులు తీశాడు. అజహర్ అలీ 56 రన్స్ కొట్టగా.బాబర్ అజం 76 రన్స్ తీసి తిరుగుముఖం పట్టారు.ఫవాద్ ఆలం 48 రన్స్ చేయగా.మహ్మద్ రిజ్వాన్ 53 పరుగులు చేసి బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు.అయితే బౌలింగ్ చేస్తున్న బంగ్లాదేశ్ టీంలోని బౌలర్స్ ఇస్లాం రెండు వికెట్స్ తీయగా.

ఎబాడోత్ హుస్సేన్, ఖలీద్ అహ్మద్ చెరో వికెట్ తీశారు.ప్ర‌స్తుతం ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ చెక్క‌ర్లు కొడుతోంది.

#Pakistan #Imam Haq #Clash #Cricket #Bangaldesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube