వైరల్ వీడియో: కాలనీలో ఆడుకుంటున్న చిన్నారులపై కారు కలకలం..!

పిల్లలు అన్నాక ఎంత సేపని ఇంట్లో ఉంటారు చెప్పండి.సరదాగా కాసేపు సాయంత్రం పూట తోటి పిల్లలతో ఆడుకోవాలని అనుకుంటారు కదా.

 Viral Video Over Speed Car Loss Control Came Over Playing Children In Sangareddy-TeluguStop.com

సరిగ్గా అలాగే కొంతమంది పిల్లలు కూడా రాత్రికి 7 గంటల సమయంలో ఆడుకోవడానికి కాలనీ బయటకు వచ్చారు.ఒక్కచోటికి అందరు వచ్చి సరదా సరదాగా మాటలు చెప్పుకుంటూ ఆడుకుంటున్నారు.

అప్పుడే ఓక పిల్లాడు సైకిల్ తొక్కుకుంటూ వచ్చి మిగతా పిల్లలతో ఆడుకోవడానికి రెడీ అయ్యాడు.కానీ ఆ పిల్లల ఆనందం ఎంతో సేపు ఉండలేదు.

ఒక్కసారిగా భారీ శబ్దంతో ఒక కారు అదుపుతప్పుతూ పిల్లల మీదకు దూసుకుని వచ్చింది.అంతే పిల్లల ముఖంలో అప్పటివరకు ఉన్న నవ్వు చెదిరిపోయి భయభ్రాంతులకు గురి అయ్యారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

అసలు ఇంతకీ ఈ కారు బీభత్సం ఎక్కడ జరిగందంటే.

సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సాయినగర్‌ అనే కాలనీలో జరిగింది.శుక్రవారం రోజున సాయినగర్ కాలనీ లోకి ఒక కారు అతివేగంగా దూసుకుని వచ్చింది.

ఆ కారును చూస్తే నూతనంగా కొనుగోలు చేసిన కారులా ఉంది.కొత్త కారు కావడంతో అతి ఉత్సహంతో డ్రైవర్ అతి వేగంగా కార్ ను నడిపాడు.

దాంతో ఆ కారు కాస్త అదుపు తప్పి సాయి నగర్ కాలనీలోని గోడలను గుద్దుకుంటూ మరి వచ్చి అక్కడే ఆడుకుంటున్న పిల్లల వైపు వచ్చింది.

ఆ పిల్లల అదృష్టం బాగుండడంతో ముందుగా ఆ ప్రమాదాన్ని పసిగట్టి భయంతో ఎక్కడివాళ్ళు అక్కడ పరుగులు పెట్టారు.అయితే డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఎంతటి దారుణం జరిగిందనే చెప్పాలి.ప్రాణ హాని అయితే జరగలేదు కానీ, పిల్లలు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న ఆ పసి ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి కదా.ఈ ప్రమాదంలో అక్కడ ఉన్న బైక్ ను కార్ గుద్దడంతో బైక్ చెల్లా చెదురు అయిపోయింది.అయితే ఈ ప్రమాదానికి సంబందించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వగా ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

అది ఇప్పుడు వైరల్‌ గా మారింది.అతి వేగం ప్రమాదకరం అని ఎన్ని సార్లు ఎన్ని విధాలుగా చెప్పినాగాని కొంతమందిలో మాత్రం మార్పు అనేది రావడంలేదు అనడానికి ఈ ఘటన మంచి ఉదాహరణ.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube