వైరల్ వీడియో: జడ్జిని హత్య చేయడానికి మాములు స్కెచ్ వేయలేదుగా..?!

చాలా మందికి ఉదయాన్నే జాగింగ్ చేసే అలవాటు ఉంటుంది.ఆ అలవాటును తెలుసుకుని ఒంటరిగా జాగింగ్ చేస్తున్న ఓ జడ్జిని టార్గెట్ చేసి హత్య చేసి చంపేశారు.

 Viral Video Ordinary Sketch To Assassinate Judge-TeluguStop.com

సినిమా స్టోరీ లాగానే అచ్చం ఒక యాక్సిడెంట్ లాగా అందరిని నమ్మించారు.కానీ అది అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ కాదని.

, కావాలని ఎవరో జడ్జి మీద కక్ష కట్టి మరి ఆటోతో గుద్ది మరి చంపించేసారని సీసీటీవీ ఫుటేజ్ చూస్తే అర్ధం అవుతుంది.ఈ హత్యకి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 Viral Video Ordinary Sketch To Assassinate Judge-వైరల్ వీడియో: జడ్జిని హత్య చేయడానికి మాములు స్కెచ్ వేయలేదుగా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ దారుణమైన ఘటన జార్ఖండ్‌ లోని ధన్‌బాద్‌ లో బుధవారం ఉదయం పూట జరిగింది.ఇంతకీ ఆ జడ్జి ఎవరో ఏంటో వివరాలు తెలుసుకుందాం.

ధన్‌బాద్‌ లో అదనపు జిల్లా జడ్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎడిజే ఉత్తం ఆనంద్ హత్యకు గురయ్యారు.అయితే డైలీ ఆయన ఉదయం పూట జాగింగ్ కు వెళ్తారు.

అదే విధంగా బుధవారం రోజున ఉదయం కూడా వాకింగ్‌ కు వెళ్లారు.

ఈ క్రమంలోనే ఆయన మేజిస్ట్రేట్ కాలనీ సమీపంలోని ఉన్న రణధీర్ వర్మ చౌక్ వద్దకు వెళ్ళగానే వెనుక నుంచి ఒక ఆటో వచ్చి జడ్జిని గుద్దేసి ఆపకుండా వెళ్లిపోయింది.

జడ్జి ఇంటి నుంచి అర కిలోమీటర్‌ దూరంలో ఈ ఘటన జరిగింది.అయితే జడ్జిని అలా ఆటో ఢీ కొట్టి వెళ్లిన తరువాత ఎవరు కూడా ఆయన్ని పట్టించుకోలేదు.

అలా దెబ్బలతో రక్తం మడుగులోనే ఉండిపోయాడు.ఆ తరువాత ఎవరో అటుగా వెళ్తున్న వ్యక్తి జడ్జిని చూసి హాస్పిటల్‌ కు తీసుకెళ్లారు.

ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయంలోనే జడ్జి చనిపోయారు.ఈ యాక్సిడెంట్ ను సీరియస్ గా తీసుకుని విచారణ చేయగా అసలు నిజాలు బయటికి వచ్చాయి.

ఇది ఒక ప్లాన్ ప్రకారం జరిగిన హత్యగా పోలీసులు గుర్తించారు.ఆటో డ్రైవర్ కావాలనే జడ్జిని ఢీకొట్టినట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది.

ఆ ఆటో ఎవరదా అని విచారణ చేయగా.అసలు నిజం తెలిసి పోలీసులు షాక్ అయ్యారు.

జడ్జిని ఢీకొట్టిన ఆటో ముందు రోజు రాత్రి ఎవరో దొంగలించారని తెలిసింది.

ఆ ఆటో పతార్దిహ్ నివాసి అయిన సుగ్ని దేవి పేరిట రిజిస్టర్ చేయబడింది.విచారణలో భాగంగా ఆటో యజమానిని విచారించగా అసలు నిజం తెలిసింది.తమ ఆటో గత రాత్రి దొంగిలించబడిందని, తరువాత రోజు ఉదయాన్నే ఈ హత్య జరిగిందని సుగ్ని చెప్పారు.

అసలు జడ్జి ఆనంద్ ను హత్య చెసింది ఎవరు అనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు.ధన్‌బాద్‌ లో ఆయన ఎన్నో మాఫియా హత్యల కేసులు చూడడంతో పాటు రీసెంట్ గా ఇద్దరు గ్యాంగ్‌స్టర్‌ లకు బెయిల్ నిరాకరించడం జరిగింది.

ఆ కోపంతో ఎవరన్నా హత్య చేసారా.? అనే అనుమానులు వ్యక్తం అవుతున్నాయని సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ సంజీవ్ కుమార్ తెలిపారు.జడ్జి హత్య కేసును సీరియస్‌గా తీసుకున్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వీ రమణ జార్ఖండ్ హైకోర్టు జడ్జితో మాట్లాడినట్లు తెలుస్తుంది.

#Uttam Anand #Uttrakhand #Judige

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు