పాపం ఆ ఉడతకు ఎంత దాహం వేసిందో.. నీళ్లు కావాలని ఎలా అడిగిందో చూడండి..?

ఉడతను దాదాపుగా అందరూ చూసే ఉంటారు.మనుషులు కనిపిస్తే చాలు పరుగులు పెడుతూ ఎక్కడో ఒక దగ్గర కనిపించకుండా దాక్కుంటుంది.

 Viral Video, Thirsty Squirrel, Asking For Water, Social Media-TeluguStop.com

ఇక ఎంతో స్పీడుగా అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది.కానీ ఇక్కడ ఉడుత చేసిన పని మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురి చేయడంతో పాటు హృదయాన్ని ద్రవింప చేస్తుంది కూడా.

ఇంతకీ ఏం జరిగింది అని అంటారా.ఇక్కడ ఉడుత మనుషుల దగ్గరికి వచ్చి ఏకంగా దాహం తీర్చాలంటూ వేడుకొంది.

అచ్చం మనిషి లాగానే ముందు రెండు కాళ్లతో దండం పెట్టి తన దాహం తీర్చాలి అంటూ వేడుకుంది ఆ ఉడతా.పాపం ఆ చిట్టీ ఉడతకు ఎంత దాహం వేసిందో మరి… అందుకే అంతలా వేడుకుంది.

దీంతో పక్కనే ఉన్న వ్యక్తులు తమ చేతిలోని వాటర్ బాటిల్ ను ఉడత నోటిదగ్గర పెట్టడంతో గుక్కతిప్పుకోకుండా నీళ్లు తాగేసింది ఆ ఉడతా.అయితే ఈ ఈ సంఘటనను అక్కడే ఉన్న మిగతా వ్యక్తులు మొబైల్ లో బంధించారు.

ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

ముఖ్యంగా ఉడత మనిషిలాగా నీటి కోసం వేడుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.అంతేకాకుండా నెటిజన్ల హృదయాలను ఈ వీడియో ద్రవింప చేస్తోంది.తన రెండు వెనుక కాళ్ళ పై నిలబడి ముందు కాళ్లతో నీళ్ళు కావాలని వేడుకోగా.సదరు వ్యక్తులు ఆ ఉడతకు నీళ్లు పట్టించి గా దాహం తీర్చగానే అక్కడినుంచి వెళ్లిపోయింది ఆ ఉడత.ఇక దీనిపై నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలాగా కామెంట్లు పెడుతున్నారు.మీరు కూడా ఓ సారి ఈ వీడియోపై లుక్కేయండి మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube