వైరల్: ఓనర్‌తో ఓ ఆట ఆడేసుకుంటోన్న పిల్లి.. భరించడం కష్టమే!

పెంపుడు జంతువులు అనగానే అందరికీ గుర్తొచ్చేవి కుక్కలు, పిల్లులు.కుక్కల్ని మనదేశంలో పెంచడం చాలా సాధారణం విషయం గానీ, చాలాదేశాలలో కుక్కలతో పాటుగా పిల్లుల్ని కూడా విరివిగా పెంచుకుంటారు.

 Viral Video Of Cat Playing With Owner Details,viral, Viral Latest,news, Viral,a-TeluguStop.com

ఇక పిల్లులు అనేవి కుక్కలకు చాలా భిన్నంగా వ్యవహరిస్తూ ఉంటాయి.సాధారణంగా పెంపుడు కుక్కలను( Pet Dog ) ఆడించాలంటే వాటి కోసం కనీసం బంతి అయినా ఉండాల్సిందే.

కానీ పిల్లులకు ఆ అవసరం ఉండదు.వాటిని కాగితం, లేదా తాడు ముక్కతో కూడా తేలికగా ఆడించొచ్చు.

పిల్లి( Cat ) ముందు తాడు, లేదా ఎగురుతున్న ఆకు కనిపించేలా వెంటనే వాటిని పట్టేసుకోవాలనే పట్టుదలతో అవి అటుఇటు ఊగుతూ ఉంటాయి.అయితే ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోన్న ఓ వీడియోని గమనిస్తే ఇందుకు పూర్తిగా విరుద్ధంగా కనిపిస్తోంది.వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ పిల్లి తన యజమానితో ఆదుకోవడం మనం చూడవచ్చు.ఈ వీడియోలోని పిల్లి తన యజమాని ముందు ఓ తీగ లాంటి వస్తువును పట్టుకో అన్నట్లుగా పెడుతోంది.

తరువాత తన యజమాని పట్టుకునే లోపులోనే మళ్లీ పక్కకు లాగి, తిరిగి తన యజమాని కంటి ముందుకు తీసుకువచ్చి చూపుతోంది.

కాగా, ఈ వీడియో తీసిన సదరు యజమాని నెట్టింట పోస్ట్ చేయడంతో .అది కాస్త వైరల్ అవుతోంది.ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

ఈ క్రమంలో కొంతమంది ‘ఏదో ఒక రోజు ఈ పిల్లులు మానవ ప్రపంచాన్ని శాసిస్తాయి’ అని కామెంట్స్ చేస్తే, ‘అసలు ఇక్కడ నిజమైన పిల్లి ఎవరు, నాకైతే అయోమయంగా, అర్థం కాకుండా ఉంది’ అని మరికొందరు చాలా చమత్కారంగా కామెంట్స్ చేస్తున్నారు.‘మీ పిల్లి రోజూ ఇలాగే ఆడుకుంటుందా’ అని మరికొంతమంది కామెంట్ చేయడం చూడవచ్చు.

మరి ఈ వీడియోను చూసిన మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube