వైరల్ వీడియో...ఎస్కలేటర్ పై జింక చేసిన ఈ పనికి నెటిజన్లు ఫిదా

మనందరికీ ఎస్కలేటర్ అంటే ఏంటో తెలిసే ఉంటుంది.ఏదో ఒక సమయంలో మనం రైల్వే స్టేషన్ కు వెళ్ళిన సమయంలోనో లేక ఎయిర్ పోర్టుకు వెళ్ళిన సమయంలోనో మనం ఎక్కే ఉంటాం.

 Viral Video  Netizens Are Fed Up With This Work Done By Deer On The Escalator, D-TeluguStop.com

ఏ మాత్రం నడిచే పని లేకుండా సులభంగా ఉండటానికి ఈ ఎస్కలేటర్ సదుపాయాన్ని వినియోగించుకుంటాం.ఇక చిన్న పిల్లలైతే చెప్పనక్కరలేదు.

ఇక భలే సరదాగా దాని మీద ఆడుకుంటారు కదా .కొన్ని సార్లు డేంజర్ కూడా.వెంట వచ్చిన తల్లిదండ్రులు వేరే పనిలో నిమగ్నమయి పోయినప్పుడు ఇక సరదాగా ఆడుకోవడానికి ఎస్కలేటర్ వైపు వెళ్ళిన ఘటనల తాలూకు వీడియోలను సామాజిక మాధ్యమాల్లో చూశాం.అయితే మనుషులు ఎక్కితే కొంచెం సరదాగా కొంచెం జాగ్రత్తగా మనం ఎస్కలేటర్ పై వెళ్తూ ఉంటాం.

కాని జంతువులు ఎస్కలేటర్ ఎక్కితే ఎలా ఉంటుంది, అవి ఎస్కలేటర్ పై ఎలా వెళతాయి, ఏం చేస్తాయి ఊహించుకుంటేనే కొంచెం ఫన్నీగా అనిపిస్తోంది కదా.

ఇక అసలు విషయంలోకి వెళ్తే యునైటెడ్ స్టేట్స లోని లూసియానాలో గాయపడిన ఓ జింక ఏకంగా ఆసుపత్రి గేటు గుండా వెళ్తుండగా అప్పటికే అక్కడ ఉన్న సిబ్బంది దానిని పట్టుకోవడానికి ప్రయత్నించడంతో ఇక జింక తెలివిగా ఎస్కలేటర్ గుండా సెకండ్ ఫ్లోర్ కు వెళ్ళింది.అయితే తీవ్ర గాయాలతో ఆసుపత్రికి వచ్చిన జింక ప్రాణాలు మాత్రం కాపాడలేక పోయారు.అయితే జింక చేసిన హడావిడికి అక్కడ ఉన్న ఓ నర్సు స్వల్ప గాయాలయ్యాయి.

ఇక్కడి వరకు అంతా బాగానే తొందరగా వెళ్ళడానికి ఎస్కలేటర్ ఉందని ఆలోచించి వెళ్లడంతో ఇక నెటిజన్లు జింక తెలివికి నెటిజన్లు ఫిదా అయ్యారనే చెప్పవచ్చు.అయితే ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

నెటిజన్లను ఎంతగానో అలరించిన ఈ వీడియోను మీకు చూడాలని ఉందా.ఇంకెందుకు ఆలస్యం.

ఓ లుక్కేయండి మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube