వైరల్ వీడియో... ఈ చిన్నారి చేసిన పనికి నెటిజన్లు ఫిదా

మన భారత దేశ సంస్కృతిలో అనాదిగా వస్తున్న మాట చిన్న పిల్లలు దైవంతో సమానం అని.చిన్న పిల్లల మనసు నిష్కల్మషంగా ఉంటుంది.

 Viral Video Netizens Are Fed Up With The Work Done By This Child-TeluguStop.com

చిన్న పిల్లలకు మనం ఏది నేర్పిస్తే అది నేర్చుకుంటారు.చెడు నేర్పిస్తే చెడు నేర్చుకుంటారు.

మంచి నేర్పిస్తే మంచి నేర్చుకుంటారు.అలా మంచి దారిలో నడుస్తూ మంచి లక్షణాలు అలవరచుకున్న చిన్నారులు చాలా మంచి మనసును కలిగి ఉంటారు.

 Viral Video Netizens Are Fed Up With The Work Done By This Child-వైరల్ వీడియో… ఈ చిన్నారి చేసిన పనికి నెటిజన్లు ఫిదా-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అటువంటి చిన్నారులే రేపటి భవిష్యత్తుకు ఆశాదీపాలుగా వెలిగిపోతారు.ఇక అసలు విషయంలోకి వస్తే మామూలుగా ఎటైనా వెళ్తుంటే వర్షం వస్తే గొడుగు పట్టుకుని మనల్ని మనం వర్షం బారి నుండి రక్షించుకుంటాం.

ఇక మనం మనుషులం కాబట్టి అప్రమత్తతతో గొడుగుతో రక్షించుకుంటాం.కాని రహదారి వెంబడి ఉండే కుక్కలు మాత్రం అవి అలా వర్షంలో తడుస్తూ ఉంటాయి.ఇలా వర్షం కురిస్తుంటే అటుగా నడుచుకుంటూ వెళ్తున్న ఓ చిన్నారి కుక్కకు సైతం గొడుగును పట్టి చిన్న వయస్సులోనే అంత గొప్ప మనసును చాటుకుంది.ఇప్పుడు ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

ఇక నెటిజన్లు ఆ చిన్నారిని ప్రశంసల్లో ముంచెత్తున్నారు.మనుషులనే కాదు మూగజీవాలను కూడా రక్షించాలని ఈ చిన్నారి తన పనితో చెప్పకనే చెప్పిందని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.

#Dog Viral News #Viral Video #ViralVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు