వైరల్ వీడియో...ఒకప్పటి ధోనీతో నేటి ధోనీ చిట్ చాట్

మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు.భారత క్రికెట్ కు అందించిన ధోనీ సేవలు చరిత్రలో నిలిచిపోతాయి.

 Ms Dhoni Chit Chat With Younger Dhoni,indian Cricketer Msh Dhoni, Ms Dhoni Inter-TeluguStop.com

మూడు ఫార్మాట్ లలో భారత క్రికెట్ కు సేవలందించిన ఘనత ధోనీ కే దక్కుతుంది.రాంచీ లాంటి ఓ మారుమూల ప్రాంతం నుండి వచ్చి తన టాలెంట్ ను ప్రపంచానికి పరిచయం చేసి భారత క్రికెట్ చరిత్రలో ఓ గొప్ప కెప్టెన్ గా నిలిచిపోయాడు.

క్రికెట్ లోనే కాక, తన గొప్ప వ్యక్తిత్వంతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు.అయితే త్వరలో ఏప్రిల్ 9 న ఐపీఎల్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

అయితే అయితే ఈ ఐపీఎల్ ప్రమోషన్ లో ధోనీ చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నాడు.అయితే తాజాగా ధోనీకి సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

క్రికెట్ అరంగేట్రం నాటి ధోనీతో ఇప్పటి ధోనీ ఇద్దరు తమ అభిరుచులను, తీపి జ్ఞాపకాలను పంచుకుంటున్నారు.ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

ఈ వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ తన వ్యక్తిగత సోషల్ మీడియాలో షేర్ చేసింది.నెటిజన్లను, ధోనీ అభిమానులకు ఎంతగానో ఆసక్తి కలిగిస్తున్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube