వైరల్ వీడియో: మనుషుల రక్తం ఎక్కువ తాగడంతో పగిలిన దోమ పొట్ట..!

వర్షాకాలం వచ్చిందంటే చాలు ప్రాంతాల్లో ఎప్పుడూ కనిపించని దోమలు ఇట్టే ప్రత్యక్షమవుతాయి.ఇంటి బయట ప్రశాంతంగా కూర్చొని వాతావరణాన్ని ఆస్వాదిస్తాం అనుకునేవారికి గుంపులు గుంపులుగా దోమలు వచ్చి దాడి చేసిన సంఘటనలు అందరికీ అనుభవమే.

 Mosquito Stomach Ruptured By Drinking Too Much Human Blood  Mosquito, Stomach, K-TeluguStop.com

ఇకపోతే ఈ దోమలలో కేవలం ఆడ దోమలు మాత్రమే మనిషి రక్తాన్ని పిలుస్తాయన్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది.మగ దోమలు మాత్రం కేవలం మొక్కల రసాన్ని తీసుకుని తన జీవితాన్ని సాగిస్తాయి.

ఇక ఆడ దోమలు మన రక్తాన్ని ఎలా పీల్చి పిప్పి చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అవి మనుషులను కుట్టే సమయంలో మన రక్తాన్ని అమాంతం లాగేస్తుంది.

ఇలా తాగుతున్న సమయంలో చాలామంది మన రక్తం ఇంత తాగిస్తుంది దీని పొట్ట పగలాలని కూడా ఎన్నోసార్లు అనుకునే ఉంటాం.కాకపోతే, ఎవరైనా దోమ పొట్ట పగలడం చూశారా.? దాదాపు చూసి ఉండరు కదా.అయితే అలాంటి వారి కోసం ఇప్పుడు ఈ వీడియో వచ్చేసింది. మనిషి రక్తం తాగడం ద్వారా దోమ తన పొట్ట పగిలి పోవడం ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూపించారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇంకా ఈ వీడియో లో వివిధ మనుషుల వద్ద దోమలు రక్తాన్ని పీల్చే సమయంలో ఆ దోమ యొక్క పొట్ట పగిలిపోయే సన్నివేశాలను క్లియర్ గా రికార్డు చేశారు.ఈ వీడియో చూస్తే నిజంగా దోమలు రక్తం పీల్చడం వల్ల వాటి పొట్ట పగులుతుందా అనే ఆలోచన కూడా రావచ్చు.

కాకపోతే రక్తం పిచడం వల్ల వాటి పొట్ట పగలడం ద్వారా ఆ దోమలకి ఎటువంటి ప్రమాదం జరగదు.ఇందుకు సంబంధించిన వీడియోను పెర్ర‌న్ రాస్ అనే వ్యక్తి తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశారు.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోని చూసేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube