వీడియో: హీరో లెవెల్లో పిల్లిని కిస్ చేసిన కోతి.. ఫిదా అవుతున్న నెటిజన్లు..!

జంతువుల్లో పిల్లలు, కోతులు చాలా ప్రత్యేకమైనవని చెప్పొచ్చు.వీటిలో ముఖ్యమైన ప్రత్యేకత ఏంటంటే, ఇవి ఇతర జంతువులతో ఏ మాత్రం భయం, బెరుకు లేకుండా ఇంటరాక్ట్ అవుతుంటాయి.

 Viral Video Monkey Kissing A Cat Viral On Social Media Details, Monkey,cat, Vira-TeluguStop.com

అంతేకాదు ఇవి ఎలాంటి జంతువులతోనైనా ఫ్రెండ్షిప్ చేయగలవు.అయితే తాజాగా ఒక అడవి కోతి ఒక పిల్లితో ఏకంగా లవ్ లోనే పడింది.

ఈ క్రమంలో అది పిల్లి చేతిని పట్టుకొని హీరో లెవెల్లో దాన్ని ముద్దాడింది.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఇది చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.వావ్, వాట్ ఏ రొమాంటిక్ సీన్ అని కామెంట్లు పెడుతున్నారు.

ఈ వీడియోకి ఇప్పటికే లక్షల్లో వ్యూస్, వేలల్లో లైకులు వచ్చాయి.

వైరల్ అవుతున్న వీడియోలో తెల్లగా, క్యూట్ గా ఉన్న పిల్లిని చూడొచ్చు.

దీన్ని ఒక యువతి ఎత్తుకుంది.ఇంతలోనే ఒక అడవి కోతి పిల్లితో స్నేహం చేయాలని ఆమె వద్దకు వచ్చింది.

ఇది గమనించిన ఆ యువతి కోతికి దగ్గరగా పిల్లిని తీసుకొచ్చింది.దీంతో క్యూట్ గా ఉన్న పిల్లిని చూసి తెగ ముచ్చట పడింది కోతి.

అంతేకాదు ఆ పిల్లి ముందు కాలును పట్టుకొని చక్కిళ్లపై మీద ముద్దు పెట్టింది.ఆ తర్వాత అక్కడి జనాలను చూసి కాస్త బెదిరింది.

అనంతరం తన క్యాట్ ప్రేయసి ని వదిలి వెళ్ళింది.దీనికి సంబంధించిన వీడియోని ఒక వ్యక్తి వీడియో తీశారు.

ఆ వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.

ఈ వీడియోని చూసిన నెటిజన్లు సో స్వీట్ అని కామెంట్లు పెడుతున్నారు.అయితే వైల్డ్ మంకీస్ తో చాలా జాగ్రత్తగా ఉండాలని, అవి ఎప్పుడు ఎలా దాడి చేస్తాయో చెప్పలేమని మరికొందరు హెచ్చరిస్తున్నారు.“వాట్ ఏ రొమాంటిక్ సీన్, హీరో హీరోయిన్ కి ముద్దు ఇచ్చినట్లుగా ఈ కోతికి పిల్లి భలే కిస్ ఇచ్చిందిగా” అంటూ ఒక యూజర్ కామెంట్ చేశాడు.ఈ క్యూట్ వీడియోని మీరు చూసేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube