అదేంటో గానీ ఈ మధ్య జంతువులకు కూడా మనుషుల అలవాట్లు వచ్చేస్తున్నాయి.అవి కూడా అచ్చం మనుషుల్లాగే చేస్తున్నాయి.
మనుషులు చేసే పనులను అలవాటు చేసుకుంటున్నాయి.ఈ మధ్య జంతువులకు సంబంధించిన వీడియోలు నెట్టింట ఎంతలా వైరల్ అవుతున్నాయో చూస్తున్నాం.
మరీ ముఖ్యంగా కోతులకు సంబంధించినవి బాగా పాపులర్ అవుతున్నాయి.కోతులు మనుషులు వాడే వస్తువులను వాడేస్తున్నాయి.
ఇప్పుడు కూడా ఇలాగే ఓ కోతి మనుషులు నిత్యం వాడే వస్తువు కోసం ఎంతలా గొడవపడిందో చూద్దాం.
మనుషులు ఇవాళ రేపు ఫోన్ ను విడిచి నిముషం కూడా ఉండలేకపోతున్నారు.
ఫోన్కు చిన్న పిల్లలు కూడా అడిక్ట్ అయిపోతున్నారు.ఫోన్ లేకపోతే కొందరు పిల్లలు అయితే అన్నం కూడా తినకుండా మారాం చేస్తున్నారు.
అయితే ఇప్పుడు కోతి కూడా తానేం తక్కువ కాదని తనకు కూడా ఫోన్ కావాలంటే ఏకంగా ఓ చిన్నారితో పోటీ పడింది.ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైలర్ అవుతోంది.
ఈ వీడియోను చూస్తే చాలా ఫన్నీగా ఉంది.కోతలుఉ ఇలా కూడా చేస్తున్నాయా అంటూ అందరూ ఫన్నీ కామెంట్లు పెట్టేస్తున్నారు.
ఇందులో ఓ చిన్నారి తమ ఇంటి ముందు మంచం మీద ఫోన్ చూసుకుంటూ ఉంటుంది.అయితే సడెన్ గా అక్కడకు వచ్చిన కోతి పాప పక్కనే సెటిల్ అవుతుంది.
వెంటనే పాప చేతిలో ఉన్న ఫోన్ను లాక్కుని.ఏదో ఒత్తుతున్నట్టు చేతుల్ని ఆడిస్తుంది.
అయితే కోతికి ఏ మాత్రం భయపడని ఆ చిన్నారి వెంటనే తన ఫోన్ను కోతి దగ్గరి నుంచి లాగేసుకుంటుంది.దీంతో కోతి కూడా తనకు కావాలంటూ పాప దగ్గరి నుంచి మళ్లీ లాక్కుంది.
ఇలా ఇద్దరూ కాసేపు ఆ ఫోన్ కోసం పోటీ పడటం మనకు ఈ వీడియోలో కనిపిస్తుంది.ఇద్దరూ కల్మషం లేని హృదయాలు పోటీ పడటం అందరినీ ఆకట్టుకుంటుంది.
.