మామూలుగా వివాహంలో స్నేహితులు, బంధువులు పెళ్లి కుమారుడు – పెళ్లి కుమార్తెలకు బహుమతులు ఇవ్వడం మనం గమనిస్తూనే ఉంటాం.ఆ బహుమతుల వారికి తగ్గ తరహాలోనే ఇవ్వడం మనం గమనిస్తూనే ఉంటాం.
ఏదైనా ఫోటో ఫ్రేమ్ లేదా నిత్యవసరలకు వాటికి ఉపయోగపడే విధంగా గిఫ్టు ఇవ్వడం మనం గమనిస్తూనే ఉంటాం.ఇవన్నీ మామూలుగా మనం చూసేవే.
కాకపోతే, తాజాగా పాకిస్తాన్ దేశంలో ఓ జంటకు మాత్రం వెరైటీ బహుమతి అందింది.కొత్తగా పెళ్లి చేసుకున్న ఆ జంటకు ఓ మహిళ ఏకే-47 రైఫిల్ బహుమతిగా ఇవ్వడంతో ఇప్పుడు అందుకు సంబంధించిన వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారింది.
ఈ కిట్టు ను చూసి అనేకమంది నెటిజెన్స్ ఆశ్చర్యపోతున్నారు.
ఈ వీడియోలో వరుడికి ఏకే-47 రైఫిల్ బహుమతిగా ఇవ్వడానికి మనం గమనించవచ్చు.
అయితే పెళ్ళికొడుకు మాత్రం ఆ ఏకే-47 ను చూసి ఇలాంటి ఆశర్యం చెందకుండా నవ్వుతూనే దాన్ని అందుకోవడం నిజంగా ఆలోచించాల్సిన విషయం.ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను వివాహ బహుమతిగా ‘‘వివాహ బహుమతిగా కలాష్నికోవ్ రైఫిల్” అనే ట్యాగ్ లైన్ తో ట్విటర్లో షేర్ చేయడం జరిగింది.
సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో అనేక మంది నెటిజెన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.ఈ వీడియోని చూసి ఓ నెటిజన్ బహుమతిని చూసి వధువు ఏమైనా భయపడిందా.? ఆవిడ సురక్షితంగానే ఉందా.? అంటూ కామెంట్ చేశారు.మరొక నెటిజన్ ఆ బహుమతిని చూసి వధువు కాస్త ఇబ్బందికి గురి అయినట్లు కనిపిస్తోంది.అంటూ సెటైర్ వేశాడు.ఇది ఇలా ఉండగా పాకిస్తాన్ దేశానికి చెందిన మరో నెటిజన్ మాత్రం.” క్షమించండి.ఇది మా పాకిస్థాన్ సంస్కృతి కాదు” అంటూ కామెంట్ చేశాడు.అయితే ఈ ఏకే-47 రైఫిల్ వరుడికి బహుమతిగా ఇచ్చేందుకు మహిళ వద్దకు ఎలా వచ్చిందనే విషయంపై ఇంకా ఎటువంటి విషయాలు తెలియ రాలేదు.