శ్రీవల్లి స్టెప్ కు ఏడుపు మానేసిన చిన్నారి.. వీడియో వైరల్?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే.ఈ సినిమా అల్లు అర్జున్ ను పాన్ ఇండియా స్టార్ గా మార్చేసింది.

 Vira Video Man Uses Pushpa Movie Srivalli Song To Calm Down Baby Crying Details,-TeluguStop.com

అంతేకాకుండా ఈ సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.పుష్ప సినిమా రిలీజ్ అయి నెల దాటినా కూడా పుష్ప సినిమా క్రేజ్ ఇంకా తగ్గలేదు.

ఎక్కడ చూసినా కూడా పుష్ప సినిమా పాటలు, డైలాగులే వినిపిస్తున్నాయి.పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నటనకుగాను దక్షిణాదిలో ఉన్న సినీ ప్రేక్షకులు అందరూ కూడా ఫిదా అయ్యారు.

ఇందులోని పాటలు డైలాగులు సోషల్ మీడియా ను ఒక రేంజ్ లో ఊపేస్తున్నాయి.ఈ సినిమాలో తగ్గేదే లేదు అన్న డైలాగ్ ను చిన్న పిల్లవాడి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఇమిటేట్ చేస్తున్నారు.

అలాగే ఈ సినిమాలో పాటల విషయానికి వస్తే ఇందులో శ్రీవల్లి, ఊ అంటావా మావా, సామీ పాటలు సోషల్ మీడియాలో మార్మోగి పోతున్నాయి.ఈ పాటలన్నీ క్రియేట్ చేస్తూ ఇప్పటికే కొన్ని లక్షల వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఇకపోతే ఈ సినిమాలో శ్రీవల్లి సాంగ్ అన్ని భాషలలో సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.ఈ పాటలోని స్టెప్పులను సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరు కూడా వేస్తూ అందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఇదిలా తాజాగా షాదాబ్ అలీ ఖాన్ అనే ఒక వ్యక్తి శ్రీవల్లి పాటకు సిగ్నేచర్ స్టెప్పును వేస్తూ చిన్న పాపాయి జో కొట్టాడు.ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.పాపను హ్యాపీ చేయడానికి శ్రీవల్లి స్టెప్పు పర్ఫెక్ట్ అంటూ ఇంస్టాగ్రామ్ లో ఈ వీడియోని షేర్ చేశారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube