వైరల్: డ్రైవర్ క్రియేటివిటీకి నెటిజన్స్ ఫిదా..!!

సోషల్ మీడియాలో నిత్యం రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది తమలో ఉన్న టాలెంట్ ను అందరికి తెలిసేలా చేసారు.

 Viral Video Man Turns His Auto As Wagonr Car Details, Driver, Creative, Viral Latest, News Viral, Social Media,, Auto Into Wagonr Car, Wagonar Car, Auto Into Car, Drivers Creativity, Talent, Viral Auto-TeluguStop.com

అందరిలోనూ ఏదో ఒక కళ అనేది దాగి ఉంటుంది.కానీ ఆ క్రియేటివిటీని సందర్భనుసారంగా మాత్రమే బయటకు తీస్తారు.

రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోతు ఉంటారు.ఎంతో మంది టాలెంట్ ఉన్నా వ్యక్తులను ప్రజలకు తెలిసేలా చేసింది సోషల్ మీడియా.

 Viral Video Man Turns His Auto As Wagonr Car Details, Driver, Creative, Viral Latest, News Viral, Social Media,, Auto Into Wagonr Car, Wagonar Car, Auto Into Car, Drivers Creativity, Talent, Viral Auto-వైరల్: డ్రైవర్ క్రియేటివిటీకి నెటిజన్స్ ఫిదా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎప్పుడైతే సోషల్‌ మీడియా అందరికి అందుబాటులోకి వచ్చిందో ప్రతి ఒక్కరు కూడా తమలో ఉన్న క్రియేటివిటీని బయటకు తీసి అందరికి తెలిసేలా చేస్తున్నారు.మనం ప్రతిరోజు సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలను చూస్తూ ఉంటాము.

వాటిలో కొన్ని వీడియోలను చూసి ఆశ్చర్యపోతూ ఉంటాము.ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తుంది.

ఆ వీడియోలోనీ వ్యక్తి క్రియేటివిటీ చూసి నేటిజన్స్ ఫిదా అవుతున్నారు.

వివరాల్లోకి వెళితే.

ఒక హైవే రోడ్డు మీద కారులో డ్రైవింగ్‌ చేస్తూ ముందుకు వేగంగా దూసుకుపోతున్నాడు ఓ వ్యక్తి.అదే సమయంలో అతను వెళ్తున్న కారును వెనకనుంచి వచ్చిన ఒక రెడ్‌ కలర్‌ వ్యాగనార్‌ కారు క్రాస్ చేసి ముందుకు వెళ్ళింది.

అయితే మొదటి కారులో ఉన్న వ్యక్తికి రెడ్ కలర్ కారును చూడగానే ఏదో అనుమానం వచ్చి తన దగ్గర ఉన్న ఫోన్ లో నుంచి రెడ్ కలర్ కారును వీడియో తీయడం ప్రారంభించాడు.ఎందుకంటే ఆ రెడ్ కలర్ కారుకు వెనుక రెండు చక్రాలు మాత్రమే ఉన్నాయి.

సాధారణంగా కారుకు నాలుగు చక్రాలు ఉంటాయి.కానీ సదరు రెడ్‌ కలర్‌ కారుకు మాత్రం వెనుక రెండు చక్రాలు మాత్రమే కనిపిస్తున్నాయి.

ముందు గల రెండు చక్రాలు లేవు.అయినాగాని కారును డ్రైవ్ చేస్తూ వెళ్తున్నారు.అసలు విషయం ఎంటా అని వీడియో తీసే అతను తన కారుకు వేగం పెంచి రెడ్ కలర్ కారును ఓవర్‌టేక్‌ చేయగా అసలు విషయం బయట పడింది.నిజానికి అది కారు కాదు.

కారులా కనిపిస్తోన్న ఒక ఆటో. ఓ ఆటో డ్రైవర్‌ తన క్రియేటివిటీని ఉపయోగించి వ్యాగనార్‌ కారుగా తన ఆటోను తీర్చిదిద్దాడు.వెనుక నుంచి ఎవరు ఈ కారును చూసినా గాని కారు అనే అనుకుంటారు తప్పా ఆటో అని మాత్రం అనుకోరు.ముందు నుంచి చూస్తేనే కారులా కనిపించిచే ఆటో అని తెలుస్తుంది.

డ్రైవర్ యొక్క క్రియేటివిటిని చూసి నెటిజన్లు ఆ డ్రైవర్ ను తెగ పొగిడేస్తున్నారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube