వైరల్ వీడియో: పామే కదా అని తేలిగ్గా తీసుకున్న వ్యక్తి.. చివరికి..?!

ఆటపట్టించడానికి అయిన, ఆట ఆడుకోవడానికి అయిన ఒక హద్దు అనేది ఉంటుంది.ఆ హద్దు దాటి ఇంకాస్త ముందుకెళ్లి ఓవర్ యాక్షన్ చేద్దామని చూస్తే ఈ వీడియోలో లాగానే ఉంటుంది.

 Viral Video Man Troubled By The Snake Who Played Games With It-TeluguStop.com

ఏంటి అసలు ఏమి చెబుతున్నామో అర్ధం కావట్లేదా.సరే అసలు విషయానికి వద్దాం.

పాములు అంటే ఎవరికీ భయం ఉండదు చెప్పండి.ఎందుకంటే పాము కాటేస్తే ప్రాణాలు సైతం పోతాయని అందరికి తెలుసు.

 Viral Video Man Troubled By The Snake Who Played Games With It-వైరల్ వీడియో: పామే కదా అని తేలిగ్గా తీసుకున్న వ్యక్తి.. చివరికి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందుకే పాములను చూసి ప్రజలు భయపడుతూ ఉంటారు.కానీ కొంతమంది మాత్రం పాములు అంటే భయం ఉన్నాగాని, ఆ భయాన్ని బయటకు చూపించకుండా నలుగురి మెప్పు పొందడానికి రకరకాల చేష్టలు చేస్తారు.

పాము మమ్మల్ని ఏమి చేయదు.పాముకు మేమంటే భయం అని చెప్పి వాటిని పట్టుకుని గిరా గిరా తిప్పడం, పాములను ముద్దు పెట్టుకోవడం లాంటి వింత చేష్టలు చేస్తారు.

పట్టుకుంటే పట్టుకున్నారు.అంతవరకు బాగానే ఉంది.

ఆ తరువాత దానిని వదలకుండా పామును పట్టుకుని రకరకాల ప్రయోగాలు చేస్తారు.

కొన్ని సార్లు ఆ ప్రయోగాలు విగటించి పాము కాటుకు బలై పోతారు.

దీనినే ఏమంటారు అంటే ఎచ్చులకు పోయి బొచ్చు గొరిగించుకోవడం అని.ఇప్పుడు ఇలాంటి ఫన్నీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా నవ్వు ఆపుకోలేరు.పామును పట్టుకుని దానిని ఒక ఆట ఆడించాలని చూస్తాడు ఒక వ్యక్తి.కానీ పామే అతన్ని ఒక ఆట ఆడుకుంది.అసలు ఇంతకీ ఈ వీడియోలో ఏముందో ఒకసారి చూద్దాం.

లుంగీ కట్టుకున్న ఒక వ్యక్తి పామును పట్టుకోని దానిని ఆట ఆడిద్దామని చూస్తాడు.

ఆ పాము కూడా అతని చేతిలో నుంచి తప్పించుకోవటానికి అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది.అప్పటికి ఆ వ్యక్తి ఆ పామును వదలకుండా గట్టిగా పట్టుకున్నాడు.సహనం కోల్పోయిన పాము కోపంతో ఆ వ్యక్తి పైకి దూకి అతని లుంగీలోకి దూరింది.

ఇంకేముంది పామును బయటకు తీయడానికి శత విధాలా ప్రయత్నం చేసాడు.పాము ఇంకాస్త లోపలికి వెళ్ళింది.

మరి కరిసిందో లేదో తెలియదు కానీ.ఒక అరుపు అరిచి కట్టుకున్న లుంగిని అక్కడే విడిచేసి పరుగెత్తాడు.

ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఫుల్ ఖుష్ అవుతున్నారు.ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.

ప్రస్తుతం ఈ వీడియో నవ్వుల్లో ముంచెత్తుంది.ఇక ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరు షేర్ చేయకుండా మాత్రం అసలు ఉండలేరు.

#Instant Karma #WhoPlayed #Viral Video #Social Meida #Troubled

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు