వైరల్ వీడియో: స్ట్రా తో ఊపిరి ఊది నాగుపాము ప్రాణం పోసిన యువకుడు..!

మనిషికి ఏదైనా అనుకోని సమయంలో సడన్ గా ఏదైనా శరీరంలో మార్పులు జరిగి సృహ తప్పి పడిపోవడం మనం చూస్తూనే ఉంటాం.అలా పడిపోయిన వారికి వెంటనే ప్రథమ చికిత్స నేపథ్యంలో భాగంగా నోటిలోకి శ్వాసను ఊది ప్రాణాలు కాపాడడం మనం చూస్తూనే ఉంటాం.

 Viral Video Man Gives Artificial Breathe To A Snake With Straw In Odisha-TeluguStop.com

అయితే ఈ ప్రక్రియ కేవలం మనుషులకు మాత్రమే కాదు జంతువులకు కూడా పని చేస్తుందని ఓ యువకుడు నిరూపించాడు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

తాజాగా ఓ యువకుడు ఓ స్ట్రా సహాయంతో శ్వాసను అందించి ప్రాణాలు కాపాడాడు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.మామూలుగా ఎవరైనా పామును చూస్తే భయపడి ఆ ప్రదేశం నుంచి అమాంతంగా దూరంగా వెళ్ళిపోవడం మనం గమనిస్తూనే ఉంటాం.అయితే కొందరు మాత్రం సర్పాలు అంటే భయం లేని వారు వాటిని చాకచక్యంగా పట్టుకుని దూర ప్రాంతంలో వదిలి పెడుతుంటారు.

 Viral Video Man Gives Artificial Breathe To A Snake With Straw In Odisha-వైరల్ వీడియో: స్ట్రా తో ఊపిరి ఊది నాగుపాము ప్రాణం పోసిన యువకుడు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి ఒరిస్సా రాష్ట్రం మల్కన్‌ గిరి లోని నౌగుడా గ్రామంలోని ఓ ఇంట్లో చోటుచేసుకుంది.ఆ ఇంట్లోకి ఓ పది అడుగుల నాగు పాము ప్రవేశించింది.

దానిని గమనించిన ఇంట్లో ఉన్న వ్యక్తులు భయభ్రాంతులకు లోనై ఇంట్లో నుంచి బయటికి పరుగులు తీశారు.వెంటనే ఆ ప్రాంతంలోని స్నేక్ క్యాచర్ వివరాలు తెలుసుకుని అతనికి ఫోన్ చేయగా సదరు వ్యక్తి ఆ ఇంటి దగ్గరికి చేరుకున్నారు.

అలా స్నేక్ క్యాచర్ అయినా స్నేహశీష్ చాలా ధైర్యం తో ఆ పామును పట్టుకొని ఇంట్లో నుంచి బయటికి తీసుకువచ్చాడు.అయితే అతను పట్టుకున్న పాము ఆ సమయంలో అపస్మారక స్థితిలో ఉండడం గమనించాడు.దీంతో అతడు ఏ ఆలోచన చేయకుండా వెంటనే దగ్గర్లోని ఓ స్ట్రా తీసుకో వచ్చి ఆ పాముకు కృతిమ శ్వాసను తన నోటి ద్వారా అందించాడు.అలా ఆ పాముకు 15 నిమిషాలపాటు శాసన అందించడంతో ఆ పాము స్పృహలోకి వచ్చింది.

ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించి వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.

#Snake Catcher #Helped #Odisha #Snake #King Cobra

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు