వైరల్ వీడియో: జడ్డు భాయ్ ని ఆటపట్టిస్తున్న మహీ.. అసలు మ్యాటర్ ఏంటంటే..?!

భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ ఎవరు అంటే అందరి నోటి నుండి వచ్చే పేరు ఎంఎస్ ధోని.ఆటగాళ్లను పరిస్థితులకు తగ్గట్టు ఉపయోగించుకోవడం, ఆటగాళ్ల ప్రతిభను గుర్తించడంలో ధోని ఎప్పుడూ ముందుంటాడు.

 Viral Video Mahendra Singh Dhoni Making Fun Of Ravindra Jadeja Sword Feat , Ms-TeluguStop.com

అందుకే అతని సారథ్యంలో ఆడిన ఎందరో ఆటగాళ్లు ఇప్పుడు స్టార్ క్రికెటర్లుగా ఎదిగారు.ధోని భారత్ కు రెండు వరల్డ్ కప్ లతో పాటు మరెన్నో ట్రోఫీలను, చారిత్రాత్మక విజయాలను అందించాడు.

ఐపీఎల్ లో చెన్నై జట్టుకు కూడా మూడు సార్లు టైటిల్ ను అందించాడు.అయితే తాజాగా ధోని ఓ ఆటగాడి స్టైల్ ను ఇమిటేట్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఆ వీడియోలో ధోని.టీమిండియా ఆల్ రౌండర్, చెన్నై ఆటగాడు రవీంద్ర జడేజా కత్తిలా బ్యాట్ ను తిప్పే విధానాన్ని చూపించాడు.

రవీంద్ర జడేజా బ్యాట్ తో రాణించినప్పుడు అలా బ్యాట్ ను కత్తిలా తిప్పుతుంటాడు.

క్రికెట్ గ్రౌండ్ లో ఒక్కో ఆటగాడు ఒక్కో స్టైల్ లో సెలెబ్రేట్ చేసుకుంటారు.

రవీంద్ర జడేజా బ్యాటును కత్తిలా తిప్పుతాడు.శిఖర్ ధావన్ క్యాచ్ పట్టినప్పుడు తొడ కొడతాడు.

రాహుల్ సెంచరీ కొట్టినప్పుడు చెవులు మూసుకుంటాడు.అయితే ఇటీవల ఐపీఎల్ బెంగళూరు తో జరిగిన మ్యాచ్ లో జడేజా తన బ్యాటింగ్ తో అదరగొట్టాడు.

ఒకే ఓవర్లో 37 పరుగులు చేశాడు.అర్ధ సెంచరీ చేసినప్పుడు బ్యాటును తిప్పాడు.

ఆ మ్యాచ్ తర్వాత ధోని జడేజా బ్యాట్ తిప్పే స్టైల్ ను గాల్లో తిప్పుతూ చూపిస్తుండడం ఓక వీడియోలో రికార్డు అయ్యింది.ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో రాబిన్ ఉతప్ప పక్కన కూర్చున్న ధోని ఇలా చేశాడు.

ఆ వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.దీంతో ఆ వీడియో వైరల్ అయ్యింది.

ఈ వీడియోకు స్వార్డ్ ఫీట్ తల అని చెన్నై హాష్ టాగ్ ఇచ్చింది.

ఈ పోస్టుపై రవీంద్ర జడేజా స్పందించాడు.బ్యాటుతో ట్రై చేయమని కామెంట్ చేశాడు.

రవీంద్ర జడేజా ధోని కెప్టెన్సీలో అటు భారత్ తరపున, ఇటు చెన్నై తరపున చాలా మ్యాచ్ లు ఆడాడు.

తన బౌలింగ్, చురుకైన ఫీల్డింగ్, బ్యాటింగ్ తో భారత జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు.ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో బెస్ట్ ఫీల్డర్ ఎవరంటే చాలా మంది రవీంద్ర జడేజా అని చెబుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube