వైరల్ వీడియో: ఎండ్రకాయ రౌండప్ చేసిన సింహాలు.. చివరకు..?!

అడవికి రారాజు ఎవరో మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.మృగరాజుగా పిలవపడే సింహం తన పంజా విసిరింది అంటే చాలు ఎంతటి వాళ్ళు అయిన సరే సింహానికి లొంగిపోవాలిసిందే.

 Viral Video: Lions Rounding Up Lobster Finally  Viral Latest, Viral News, Viral-TeluguStop.com

ఎందుకంటే సింహం ఒకసారి వేట మొదలుపెట్టిందంటే ఇతర జంతువులకు గుండెల్లో దడ మొదలయిపోతుందన్నమాట.వాటికి ఇక చావు తప్పదు అన్నమాట.

అందుకే మనుషులతో సహా జంతువులు కూడా సింహాన్ని చూసి గజగజ వణికిపోతారు.అయితే ఒక్క సింహాన్ని చూసే మనం బయపడిపోతే ఒకేసారి సింహలు గుంపుగా వచ్చి ఒక ప్రాణిపై దాడి చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి.

ఆ బీభత్సo ఊహకి కూడా అందడం లేదు కదా.అయితే ఇప్పుడు అలాంటి ఒక ఘటన సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.ప్రస్తుతం సింహల వీడియో వైరల్ గా మారింది.

ఇంతకీ సింహల గుంపు దాడి చేసింది ఎవరి మీదనో తెలిస్తే షాక్ అవుతారు.

ఆ జీవి మరేంటో కాదు.ఒక ఎండ్రకాయ.

అవును అండి మీరు విన్నది నిజమే ఓ ఎండ్రకాయను చూసి ఏకంగా ఐదు సింహాలు దాన్ని చుట్టుముట్టాయి.అయితే ఎండ్రకాయ మాత్రం చుట్టూ పొంచి ఉన్న ప్రమాదాన్ని లెక్క చేయకుండా, తన చుట్టూ సింహలు ఉన్నాయన్న విషయమే మర్చిపోయి ఎంతో దైర్యంగా ఉంది.

అసలు ఏ మాత్రం భయం, బెణుకు అనేది లేకుండా జరజరా పాక్కుంటూ ముందుకు వెళ్ళిపోతుంది.అయితే సోషల్ మీడియాలో పోస్ట్ అయిన వీడియోలో ఎక్కడి వరకే ఉంది.

తరువాత ఆ ఎండ్రకాయను సింహాలు ఏమి చేశాయో తెలియదు.సింహాలకు, ఎండ్రకాయకు మధ్య జరిగినది దృశ్యాలను రేంజర్స్‌ రగ్గిరో బారెటో, రాబిన్ సెవెల్ అనే ఇద్దరు ఫోటోగ్రాఫర్‌ లు తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో అప్‌ లోడ్‌ చేసారు.

అప్ లోడ్ చేసిన అతి తక్కువ సమయానికే నెట్టింట్లో వైరల్‌ గా మారింది.

ఇసుకలో నుంచి బయటకు వచ్చిన ఎండ్రకాయను అక్కడే ఉన్న ఒక సింహం చూస్తుంది.ఆ తరువాత ఎండ్రకాయ వెళ్లే దారిని ఫాలో అవుతూ, దాని కదలికలను పరిశీలిస్తుంది.మరి కొద్దిసేపటికి అక్కడ ఉన్న మరో నాలుగు సింహాలు కూడా చేరి ఎండ్రకాయను రౌండప్ చేస్తాయి.

అయితే ఎండ్రకాయ మాత్రం సింహాల గుంపును పట్టించుకోకుండా జరజరా వెళ్ళిపోతుంది.తనను ఐదు సింహాలు రౌండప్ చేసిన విషయాన్ని అస్సలు పట్టించుకోని ఆ ఎండ్రకాయ తన దారిన తాను వెళ్లిపోతుంది.

ఈ వీడియోకు నెటిజన్ల నుండి విశేష స్పందన వచ్చింది.వీడియో చుసిన ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టకుండా ఉండరు.ఇప్పటిదాకా కొన్ని వేలలో వ్యూస్ వచ్చాయి.అసలు ఇంతకు ఆ ఎండ్రకాయ బతికి ఉందో లేక సింహాల వలలో చిక్కుకుని చనిపోయిందో అని చాలామంది కామెంట్స్ పెడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube