వైరల్ వీడియో: నడిరోడ్డు పై సింహాల గుంపు.. చివరికి..?

Viral Video Lions Group Creating Menace In The Middle Of The Road At Last

ఈ మధ్యన సోషల్ మీడియాలో రకరకాల జంతువుల వీడియోలు తెగ వైరల్ గా మారుతున్నాయి.వాటిలో కొన్ని రకాల జంతువుల వీడియోలు చూస్తే మనసుకు ప్రశాంతంగా ఉంటే మరికొన్ని జంతువులకు సంబందించిన వీడియోలు మాత్రం వెన్నులో వణుకు పుట్టించే అంత భయంకరంగా ఉంటాయి.

 Viral Video Lions Group Creating Menace In The Middle Of The Road At Last-TeluguStop.com

ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిన జంతువుల వీడియో కూడా ఒకరకంగా భయం పుట్టించే వీడియో అనే చెప్పాలి.అడవికి రారాజుగా మృగరాజు పేరు చెప్పుకుంటాము కదా.అడవిలో ఉండే ప్రతి జంతువుతో పాటు మనుషులు కూడా ఈ సింహాన్ని చూస్తే భయపడిపోతారు.అంతెందుకు సింహం గాండ్రిస్తే చాలు ఆ సౌండ్ కే పై ప్రాణాలు పైనే పోతాయి.

ఒక్క సింహాన్ని చూసే మనం అలా అంటే ఏకంగా మూడు సింహాలు ఒకేసారి దాడి చేస్తే ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాము.ఒళ్ళు జలతరిస్తుంది కదా ఆ ఊహకే.

 Viral Video Lions Group Creating Menace In The Middle Of The Road At Last-వైరల్ వీడియో: నడిరోడ్డు పై సింహాల గుంపు.. చివరికి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే వీడియోలో ఒకేసారి మూడు సింహాలు కలిసి ఓ కారును చుట్టుముట్టాయి.ఆ సింహాలను చూసి కారులో ఉన్న పర్యాటకుల పరిస్థితి ఏంటో ఆలోచించండి.

దేవుడా ఈరోజు మా పని అయిపోయినట్లే అని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఉంటారు.ఈ వీడియో చూస్తే మీకే అర్ధం అవుతుంది.

చూసే మనకే ఇలా ఉంటే పాపం కారులో ఉన్న ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉంటుందో అని.ఈ భయంకరమైన వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నందా ట్విట్టర్ లో షేర్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది.

ఒకసారి ఈ వీడియోను గమనిస్తే ఉన్నటుండి మూడు సింహాలు ఓ కారును చుట్టుముట్టాయి.ఒక సింహం అయితే ఏకంగా కార్ పైకి ఎక్కి కార్ సైడ్ మిర్రర్‌ ను పట్టుకుని పీకుతూ ఉండడం మనం గమనించవచ్చు.మరో రెండు సింహాల కారుకు ఇరువైపులా నుంచుని ఉన్నాయి.అవి చేసే హంగామాకు కారులోని పర్యాటకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉండి ఉంటారు.ఆ సింహాలు కారు మీద దాడి చేయడం చూసి అటుగా వస్తున్న కారులు కూడా వెనుదిరిగి వెళ్లిపోవడం మనం వీడియోలో చూడవచ్చు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ పెడుతున్నారు.ఆ కారులోని వ్యక్తులకు ఏమి కాకూడదని ఆశిస్తున్నామని చాలామంది కామెంట్స్ పెడుతున్నారు.

#Jungle Safari #Attack #Middle #Animals #Menace

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube