వైరల్ వీడియో... ఒంటరిగా వెళ్తున్న వ్యక్తిని వెంటాడిన సింహం.. ఆ తరువాత?

సాధారణంగా అడవిలో ప్రయాణమంటేనే సాహసంతో కూడుకున్న పని.అందుకే అడవిలో ప్రయాణించాలంటే ఒంట్లో వణుకు మొదలవుతుంది.

 Viral Video Lion Chasing A Man Going Alone , Viral News, Viral Video In Internet-TeluguStop.com

అదే ఒక్కరే రాత్రి ప్రయాణించాలంటే అసలు ఆలోచన చేయరు చాలా మంది.ఎందుకంటే అడవిలో రాత్రిపూట చాలా జంతువులు బయట సంచరిస్తుంటాయి.

ఎప్పుడు ఏ జంతువు దాడి చేస్తుందని భయంతో బిక్కుబిక్కు మంటూ ఉంటుంది.అయితే ఒక వేల ధైర్యం చేసి అడవిలోకి వెళళ్ళినప్పుడు ఒక సింహం మీ వెంట పడితే ఇక చేసేముంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగెత్తడమో… వాహనంలో అయితే స్పీడ్ గా వాహనంలో వెళ్లడమో చేయాలి.

ఇక పరిస్థితి బాగాలేక పులి పంజాకు దొరికితే ఇక ప్రాణాలు గాలిలో కలిసి పోవాలసిందే.అచ్చం ఇలాగే జరిగిన ఓ ఘటన ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

అమెరికాలోని ఉతాలోని సాల్ట్ లేక్ సిటీలో జార్డ్ స్మిత్ అనే వ్యక్తికి విచిత్ర అనుభవం ఎదురైంది.అక్కడ ఉన్న బిక్ కాటన్ వుడ్ లోయలోకి వెళ్ళినప్పుడు అడవి పిల్లి తరహాలో ఉన్న ఓ జంతువు స్మిత్ వెంట పడింది.

దాన్ని బిగ్ క్యాట్ అంటారు.ఆమెరికాలో అరుదుగా ఉండే జంతువు.

చిరుత పులితో సమానమని అంటుంటారు.ఒక్కసారి దీనికి దొరికితే ఇక ప్రాణాలను ఆశలు వదిలేసుకోవాలసిందే.

ఇంతటి క్రూరమైన జంతువు స్మిత్ ను వెంటాడుతుంది, ఇతను వామ్మో వామ్మో అనుకుంటూ పరుగెత్తుతూనే వీడియో తీశాడు.వీడియో ఆద్యంతం చాలా ఉత్కంఠగా సాగుతుంది.

మొత్తానికి కొద్ది దూరం వెంబడించి అది తిరిగి వెనక్కి వెళ్ళిపోయింది.ఇక ఈ వీడియోను చూస్తున్న నెటిజన్లు సైతం ఊపిరిపీల్చుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube