వైరల్ వీడియో: రిలాక్స్ అవుతున్న చిరుత.. అంతలోనే మొసలి..?!

మొసలిని సముద్రపు అలెగ్జాండర్‌ అని పిలుస్తారు.మొసలి ఒక్క పట్టు పడితే అంత సులువుగా విడిచిపెట్టదు.

 Viral Video  Leopard Relaxing  Crocodile In The Meantime, Viral Video , Viral Vi-TeluguStop.com

భారీ ఏనుగునైనా సరే తన నోటితో కట్టిపడేస్తుంది.అంతటి బలం ఉన్న మొసలి నోటికి చిక్కిన ఓ చిరుత అదృష్టవశాత్తూ తప్పించుకుని పారిపోయింది.

ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

సాధారణంగా మొసళ్ళు చూడటానికి చాలా భయంకరంగా ఉంటాయి.వాటి దంతాలు చాలా పదునుగా ఉంటాయి.నీటిలో ఎక్కువగా ఉండే మొసళ్ళు అప్పుడప్పుడు ఒడ్డుపైకి వస్తుంటాయి.

మొసళ్ళ దవడలు చాలా బలంగా ఉంటాయి.మొసళ్ళు నీటిలో వేగంగా కదలగలుగుతాయి.

మొసళ్ళు పుట్టినప్పుడు 20 సెం.మీ ఉంటాయి.కానీ పెద్దయ్యాక వాటి బరువు సుమారు 1200 కేజీలు ఉంటుందట.మొసళ్ళలో వివిధ జాతులుంటాయి.

ఇక చిరుత విషయానికి వస్తే చిరుత పులులు వేగానికి పెట్టింది పేరు.చిరుతపులి క్షణాల్లోనే ఏ జంతువునైనా వేటాడగలదు.

చిరుతపులి గంటకు 80 నుంచి 130 కిలో మీటర్ల వేగంతో పరిగెత్తగలదనే ఓ అంచనా ఉంది.అలాంటి చిరుత మొసలికి భయపడి పారిపోయింది.

వైరల్ ఈ వీడియోలో అవుతున్న ఓ చిరుత పులి నీటి మడుగు ఒడ్డున పడుకుని ఉంది.నీళ్లలోకి ముఖం పెట్టి ఉంది.అయితే అప్పటికే అదే చోట నీటిలో ఉన్న మొసలి ఒక్కసారిగా చిరుతపైకి విరుచుకుపడింది.దీంతో చిరుత అలర్ట్ అయ్యి వెంటనే అక్కడినుంచి వేగంగా పరిగెత్తి పారిపోయింది.ఈ వీడియోలో చిరుత ఎంత వేగంగా పరిగెత్తగలదో మనం చూడొచ్చు.ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

చిరుత చాకచక్యంగా జంప్ అయ్యిందని అంటున్నారు.ఈ వీడియో పోస్ట్ అయ్యాక.

కొన్ని నిమిషాల్లోనే లక్షల వ్యూస్‌ ని రాబట్టింది.జంతువులకు సంబంధించిన ఇలాంటి వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో ఎక్కువగా దర్శనమిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube