గత రెండు నెలల నుండి హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఉన్న రాజేంద్ర నగర్ లో చిరుతపులి తిరుగుతూ అప్పుడప్పుడు రోడ్లపైకి వచ్చి కనిపిస్తూ ఉండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్న సంగతి మనకు తెలిసిందే.ఇదివరకు కూడా ఓసారి లారీ డ్రైవర్ లకు ఆ చిరుతపులి రోడ్డుపై కనిపించి నానా హంగామా చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది.
అయితే ఆ తర్వాత రెండు నెలలకు దాన్ని అధికారులు పట్టుకోగలిగారు.తాజాగా అచ్చం ఇలాగే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ లో కూడా అచ్చం అలాంటి మరో చిరుతపులి నగరంలోని వీధుల వెంబడి తిరుగుతోంది.
తాజాగా ఇందుకు సంబంధించి నగరంలోని వీధుల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లో ఆ చిరుత కదలికలు స్పష్టంగా రికార్డయ్యాయి.ఆ వీడియో సిసిటివి ఫుటేజ్ లలో చిరుత చూడటానికి చాలా పెద్దదిగా కనిపిస్తోంది.
ఒకవేళ అది ప్రజలపై దాడి చేస్తే మాత్రం తప్పించుకోవడం చాలా కష్టం.నగరంలో చిరుత ప్రవేశించిన విషయం కొద్ది నిముషాల్లోనే నగరం మొత్తం పాకిపోయింది.
ప్రస్తుతం సీసీటీవీలో రికార్డు అయిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రస్తుతం నగరంలో ఆ చిరుత పులి రాజానగర్ ఏరియాలో తిరుగుతున్నట్లు ఆ రాష్ట్ర అధికారులు గుర్తించారు.
తాజాగా ఘజియాబాద్ డెవలప్మెంట్ అధారిటీ రూం దగ్గరకు ఆ చిరుత వెళ్లిందని కొందరు తెలిపారు.అయితే అక్కడ జనరేటర్ ఆన్ చేయగానే అక్కడినుంచి పారిపోయినట్లు కూడా తెలిపారు.
అలా బయటికి వచ్చిన చిరుతపులి చెట్టుపై ఎక్కి అటు ఇటు చూసి మళ్ళీ కిందికి దిగగా చుట్టుపక్కన ఉన్న జనం శబ్దాలతో హడావిడి చేయడంతో దాంతో ఆ చిరుత పులి దగ్గర్లో ఉన్న ఓ ఇన్స్టిట్యూట్ క్యాంపస్ వైపు వెళ్లినట్లు వాళ్ళు తెలియజేశారు.అయితే ఆ తర్వాత మాత్రం ఆ చిరుత ఎక్కడికి వెళ్లి పోయిందో అర్థం కాలేదని చిరుత పులిని చూసిన వ్యక్తులు తెలిపారు.