వైరల్ వీడియో: ఊహించని విధంగా జింక పిల్లను వేటాడిన చిరుత..!  

Viral video Leopard hunts deer cubs unexpectedly, leopord huntung, viral latest, viral video, viral news, social media, kills deer cub, pregnant deer - Telugu Kills Deer Cub, Leopord Huntung, Pregnant Deer, Social Meida, Viral Latest, Viral News, Viral Vidoe

అడవిలో మృగాలు వేట అనేది సర్వసాధారణం.మృగాలు తమకు నచ్చిన జంతువులను పరిగెత్తించి పరిగెత్తించి మరీ ప్రాణాలు తీస్తుంటాయి.

TeluguStop.com - Viral Video Leopard Hunts Deer Cubs Unexpectedly

కొన్ని జంతువులు డైరెక్ట్ అటాక్ చేస్తే.మరికొన్ని జంతువులు వేటాడి వెంటాడి తమ ప్రాణాలు తీస్తుంటాయి.

అడవుల్లో జంతువుల మధ్య వైరం ఎక్కువే ఉంటుంది.మృగాలు తమ కంటికి కనిపించిన జంతువుని దక్కించుకునేంత వరకు వదిలిపెట్టవు.

TeluguStop.com - వైరల్ వీడియో: ఊహించని విధంగా జింక పిల్లను వేటాడిన చిరుత..-General-Telugu-Telugu Tollywood Photo Image

 సామాజిక మాధ్యమాల్లో కొన్ని మృగాలు వేరే జంతువులను ఎలా హింసించి చంపుతాయే చూస్తూనే ఉంటాం.సింహాలు.

అడవి దున్నలను, కంచర గాడిదలను, జింకలను, మొసళ్లను ఎలా చంపుతాయో చూస్తుంటాం.పులులు కూడా ఆహారాన్ని అలానే సంపాదిస్తాయి.

అయితే పులులకు జింక మాంసం అంటే మహా ఇష్టం.వీటి కోసం పడరాని పాట్లు పడుతుంటాయి.

జింక వెంట పరుగెడుతూ మరీ వెంటాడుతాయి.

అయితే గర్భంతో ఉన్న జంతువుకి ప్రమాదాల కాసింత ఎక్కువే.

ఎందుకంటే.గర్భంతో ఉన్నప్పుడు జంతువులకు ఆయాసం ఎక్కువ.

అందుకే ఎక్కువ దూరం పరుగెత్తలేవు.డెలివరీ తర్వాత పుట్టిన జంతువు పిల్లలను కాపాడుకోవడం కూడా కష్టమే.

ఈ సమయంలో మృగాలు కనిపించినప్పుడు అప్పుడే పుట్టిన జంతు పిల్లలను వదిలేసి పారిపోతుంటాయి. అప్పుడే ప్రసవించిన ఓ జింక పిల్లను తల్లి జింక దానిని నాలికతో శుభ్రం చేసుకుంటూ సంతోషంగా దగ్గరకు చేర్చుకుంటుండగా, అంతలోనే ఓ చిరుత చూసి పరుగున జింక దగ్గరకొచ్చింది.

ఇంకేముందు చిరుతను చూసిన తల్లి జింక వెంటనే పారిపోయింది.ఇక చిరుత ఏం చేస్తుంది వెంటనే పిల్ల జింకను ఆరగించేందుకు ప్రయత్నించింది.

కొద్ది సేపు చిరుత అటు ఇటుగా చూస్తే చివరికి జింక పిల్లను నోట కర్చుకుని వేలాడదీస్తూ ఓ చెట్టు వద్దకెళ్లింది.

చిరుత జింక పిల్ల తలను నోట్లో పెట్టుకుని పొదల చాటున వెళ్తుండగానే ఆ పిల్ల చనిపోయింది.ముందుగా వీడియోలో చూస్తున్నట్లు పిల్ల జింకను ఏమి చేయకుండా కాపాడుతుందని అనుకునే లోపే జింక పిల్లను నోట కర్చుకుని ప్రాణాలు తీసింది.పాపం అప్పుడే పుట్టిన జింకకు వందేళ్లు నిండినట్లయింది.ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.అయితే ఈ వీడియోను చూసిన నెటిజన్లు జింక పిల్లను చంపబోదేమోనని అనుకున్నారు.కాని, చివరికి చిరుత పిల్ల జింక తలను నోట్లో పెట్టుకుని చంపేసింది.

#Kills Deer Cub #Leopord Huntung #Social Meida #Viral Vidoe #Pregnant Deer

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు