వైరల్ వీడియో: కుక్కపై చిరుత అమానుషం..!

ఈ మధ్యకాలంలో ఎన్నో రకాల వీడియోలు సోషల్ మీడియా ద్వారా ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్న విషయం మనం గమనిస్తూ ఉంటాం.ఇందులో భాగంగా పక్షులకు, జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా అవ్వడం మనం చూస్తూ ఉంటాం.

 Leopard Attacked Pet Dog In Nashik, Nashik, Leopard,dog, Viral Video, Social Med-TeluguStop.com

తాజాగా చిరుతపులి, కుక్క కు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది.వన్యప్రాణులలో చిరుతపులి ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

దాని కంట ఏ జీవి అయినా సరే పడింది అంటే ప్రాణాన్ని పోగొట్టుకుంటుంది.తాజాగా ఓ చిరుతపులి సంబంధించిన వీడియో ఇప్పుడు నెటిజన్లను మళ్లీ మళ్లీ చూసేలా చేస్తోంది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

మహారాష్ట్ర లోని నాసిక్ జిల్లాలో ఉన్న అహ్మద్ నగర్ లో ఇక్కత్ పూరి అనే గ్రామం వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది.

గ్రామంలోని ఓ ఇంటి దగ్గర బాగా దట్టమైన చెట్లు ఉన్న ప్రాంతంలో ఓ చెక్క దుంగకు పెంపుడు కుక్క ను కట్టాడు దాని యజమాని.అయితే ఇంతలో ఆ ప్రాంతంలో ఉన్న చెట్ల పొదల్లో నుంచి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ చిరుతపులి ఎంటర్ అయింది.

దాన్ని చూడగానే ఆ కుక్కకు ప్రాణం పోయినంత పని అయిపోయింది.దాన్ని నుంచి తప్పించుకుందామని ఎన్ని ప్రయత్నాలు చేసినా దానిని కట్టి వేయడంతో చివరికి ప్రాణాలను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఒక్కసారిగా చిరుతపులి ఆ కుక్కపై పడి దాని మీద పంజా వేసింది.దాంతో దెబ్బకి కుక్క ప్రాణాలు అలాగే గాలిలో కలిసిపోయాయి.ఈ తతంగమంతా ఆ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది.

ఆ కుక్కను చిరుతపులి చంపాక దానిని లాకొని పోదామని అనుకున్నా అది చిరుత పులి కి సాధ్యపడలేదు.

దాంతో ఏం చేయాలో అర్థం కాక ఆ చిరుతపులి అటూ ఇటూ చూసింది.ఆ సమయంలో ఆ చిరుత పులి ఆ కుక్కకి ఉన్న గొలుసు ను తెంచేసింది.

దీంతో ఆ కుక్క శవాన్ని చిరుతపులి చెట్ల లోకి లాక్కొని వెళ్ళింది.ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మీరు కూడా ఈ వీడియో చూసేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube