గ్లాసులోని వాటర్‌ను తాగుతున్న నల్లత్రాచు.. వీడియో వైరల్!

పాముల్లో అత్యంత ప్రమాదకరమైనది, అత్యంత విషపూరితమైనది, బాగా భయపెట్టేది కింగ్ కోబ్రా అని నిస్సందేహంగా చెప్పవచ్చు.వీటికి సంబంధించిన వీడియోలు చూస్తే చాలు వెన్నులో వణుకు పుడుతుంది.

 Viral Video King Cobra Drinking Water From A Glass Held In The Hand Details, Wat-TeluguStop.com

అలాంటిది వీటికి దగ్గరుండి మరీ నీళ్లు తాగిస్తారా? అని అడిగితే వామ్మో అని అంటారు కదా.కానీ ఒక వ్యక్తి ఒక పెద్ద నల్లతాచు కి నీళ్లు తాగించారు.ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేసిన ఈ వీడియో క్లిప్ నెటిజన్లను బాగా భయపెడుతోంది.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక నల్ల నాగుపాము ఒక గ్లాసులోని నీటిని తాగుతున్నట్లు మనం చూడవచ్చు.

ఎవరో ఒక గ్లాసు నిండా వాటర్ పట్టుకుని ఉండగా, నల్లటి నాగుపాము గ్లాసులోంచి నీటిని చాలా శాంతంగా సిప్ చేస్తుండటం గమనించవచ్చు.ఈ పాము చూసేందుకు చాలా పెద్దగా ఉంది.

ఇది పెరటిలో కనిపించింది.ఏది ఏమైనా మనం హాని తలపెట్టపోయినా అవి దాడి చేసే ప్రమాదం ఉంది.

అందుకే వీటికి వీలైనంత దూరంగా ఉండటం మంచిది.వీడియోని బట్టి చూస్తుంటే ఇది ఒక పెంపుడు పాము అని కూడా తెలుస్తోంది.

ఈ వీడియోను ఎన్‌.సి సుకుమార్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసారు.“ఇక్కడ మీరు చేతిలో పట్టుకున్న గ్లాసు నుంచి నీరు తాగుతున్న కింగ్ కోబ్రాను చూడొచ్చు.పాములకు కూడా నీరు అందించి అవి డీహైడ్రేషన్ కు గురికాకుండా కాపాడాలి.

నాగు పాములు నీరు త్రాగడానికి నోరు తెరవవు.ఇవి చిన్న నాసికా రంధ్రాల ద్వారా నీటిని పీల్చుకుంటాయి.” అని ఒక క్యాప్షన్ జోడించారు.బాటిల్ నుంచి వాటర్ తాగిన నాగు పాములు చాలానే ఉన్నాయి.

వీటికి సంబంధించిన వీడియోలు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube