వైరల్ వీడియో: సినిమా షూటింగ్ కాదండోయ్.. కారు బానెట్ పై మెరుపు వేగంతో వెళ్తున్న వ్యక్తి..!

ఈమధ్య సోషల్ మీడియాకు బాగా క్రేజ్ పెరిగిపోయింది.సోషల్ మీడియా వేదికగా ఎన్నో రకాల పోస్టులు వైరల్ గా మారుతున్నాయి.

 Viral Video Kadandoy Film Shooting A Man Going With Lightning Speed On The Car Bonnet-TeluguStop.com

వాటిల్లో కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని మాత్రం బాధాకరంగా ఉంటాయి.సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలను నెటిజన్లు బాగానే వైరల్ చేస్తున్నారు.

అయితే ఉత్తరప్రదేశ్‌ లో జరిగిన ఒక హృదయ విదారకమైన ఘటన చుస్తే అయ్యో పాపం అని అనకుండా ఉండలేరు.ప్రస్తుతం ఈ ఘటనకి సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారుతోంది.

 Viral Video Kadandoy Film Shooting A Man Going With Lightning Speed On The Car Bonnet-వైరల్ వీడియో: సినిమా షూటింగ్ కాదండోయ్.. కారు బానెట్ పై మెరుపు వేగంతో వెళ్తున్న వ్యక్తి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మరి ఇంతకీ ఆ వీడియోలో ఏముందో ఒకసారి లుక్ వేద్దామా.

బాగా రద్దీగా ఉండే ఒక ఫ్లై ఓవర్‌ మీద ఒక కారు వేగంగా వెళ్తుంది.

ఆ కారు ముందు బానెట్‌ మీద ఓ యువకుడు ప్రాణాలు గుప్పట్లో పెట్టుకుని భయం భయంగా అరుస్తున్నాడు.చివరకి ఏమైంది.అసలు ఆ యువకుడు కార్ బానెట్ మీద ఎందుకు ఉన్నాడు అనే వివరాలు చూద్దాం.కాన్పూర్, లక్నో హైవేలోని జజ్మౌ ఫ్లైఓవర్‌పై ఈ వింత ఘటన చోటు జరిగినట్లు తెలుస్తుంది.

మొదట ఈ వీడియో చుసిన నెటిజన్లు ఏదో సినిమా స్టంట్ అని అనుకున్నారు.కాని తరువాత సినిమా కాదు నిజం అని తెలుసుకుని ఆశ్చర్య పోతున్నారు.

అసలు ఏమైంది అంటే కార్ బానెట్ మీద ఉన్న వ్యక్తి ఒక ట్రక్ క్లీనర్.

ఒక కారు యాజమాని, ట్రక్కు క్లీనర్‌ మధ్య జరిగిన గొడవ ఈ ఘటనకు కారణం.దీనితో కోపంలో కారు ఓనర్ తన కారును ట్రక్కు క్లీనర్‌ మీద ఎక్కించేందుకు ప్రయత్నించాడు.అయితే ఆ ప్రమాదం నుంచి తప్పించుకునే క్రమంలో కారు బానెట్‌ మీద పడిపోయాడు.

అయినాగానీ కార్ ఓనర్ కనికరించకుండా కోపంతో కారును మరింత వేగంగా 5 కిలోమీటర్లు వరకు అదే వేగంతో ముందుకు తీసుకెళ్లాడు.అయితే ఈ ఘటనకు సంబంధించి ఎవరు కూడా పోలీసులుకు ఫిర్యాదు చేయలేదు.

కానీ సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఎవరికయినా వివరాలు తెలిస్తే తమకు అందించాలని పోలీసులు కోరారు.

#Viral #Car Accident #Car Banet #Viral Video #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు