వైరల్ వీడియో: ' నెవర్ గివ్ అప్ ' అంటే ఇదేనేమో..!

ప్రతిభకు వయసుతో పని లేదు.నేర్చుకోవాలనే పట్టుదల ఉంటే చాలు అదే మనల్ని గమ్యం వెంట నడిపిస్తుంది.

 Viral Video: Is This What 'never Give Up' Means Viral Video, Little Girl, Falls-TeluguStop.com

ఒకసారి కింద పడ్డాము కదా అని నిరాశతో లేవకుండా అలానే ఉంటే అక్కడితోనే మన పోరాటం ఆగిపోతుంది.అలా కాకుండా కింద పడిన వెంటనే పైకి లేచి మళ్ళీ గెలవడానికి ప్రయత్నం చేస్తేనే అనుకున్న విజయం మన సొంతం అవుతుంది.

ఇప్పుడు ఈ చిన్నారి కూడా అదే చేసింది.స్కేటింగ్ చేయడం అంటే మాములు విషయం కాదు.

పూర్తి ట్రైనింగ్ తోనే అది సాధ్యపడుతుంది.ఏ మాత్రం అటు ఇటు అయిన కిందపడి దెబ్బలు తగిలే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.

ప్రస్తుతం కొంతమంది చిన్నారులకు సంబంధించిన రోలర్ స్కేటింగ్ విడియో నెటిజన్లను బాగా ఆకర్షిస్తుంది.నిజానికి ఈ వీడియో ఇప్పటిది కాదు.

గత సంవత్సరానికి చెందిన వీడియో ఇది.మళ్ళీ ఇప్పుడు దేశంలో ఒలంపిక్స్ పోటీలు జరుగుతున్న సమయంలో రెండోసారి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అసలు వివరాల్లోకి వెళితే మసాచు సెట్స్‌ లోని హడ్సన్ లో 8 సంవత్సరాల లోపు చిన్న పిల్లలకు రోలర్ స్కేటింగ్ పోటీలు నిర్వహించగా ఈ పోటీల్లో పాల్గొన్న నాలుగేళ్ల చిన్నారి మియాస్ మీదనే అందరి ఫోకస్ పడింది.ఎందుకంటే ఈ చిన్నారి వయసు చాలా చిన్నది.

అలాగే ఆట ప్రారంభం అయ్యి కొద్ది దూరం వెల్లాగానే కిందకి పడిపోయింది.కింద పడ్డకాని ఏ మాత్రం భయపడకుండా మళ్ళీ తిరిగి శివంగిలా పైకి లేచింది మియాస్.

మళ్ళీ స్కేటింగ్ మొదలుపెట్టి మెరుపు వేగంతో ముందున్న చిన్నారులను దాటి పోటీలో నెగ్గింది.

చిన్నారి ప్రతిభను, ఆత్మ స్తైర్యాన్ని చూసి అందరూ చప్పట్లతో అభినందనలు తెలియచేస్తున్నారు.మియాస్ తండ్రి అయిన ఆంటోని ఈ పోటీలకు సంబందించిన వీడియోను రికార్డు చేసి నెట్టింట్లో పోస్ట్ చేసారు.ఇప్పటిదాకా 500 మిలియన్ల వ్యూస్ వచ్చాయంటెనే అర్ధం చేసుకోండి ఈ వీడియో ఎంత పాపులర్ అయినదో.

ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఆ చిన్నారికి కామెంట్స్ రూపంతో అభినందనలు చెప్తున్నారు.పోటీలో అవాంతరాలు అనేవి సర్వ సాధారణమైన విషయం.అవన్నీ తట్టుకుని పోటీల్లో పాల్గొంటేనే విజయాన్ని మనం సాధించగలం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube