దెయ్యాల గురించి ఎన్ని సినిమాలు వచ్చినా.వీడియోలు వచ్చినా అవి సూపర్ హిట్ అవుతుంటాయి.
ఎందుకంటే దెయ్యాలు అనేది ఎవరికీ అంతుచిక్కని ఒక ఆసక్తికరమైన అంశం.ఉన్నాయా లేదా అనే విషయం తెలుసుకోవడానికి ఎన్ని వీడియోలు చూడమన్న చూస్తూనే ఉంటారు.
అయితే ఆ వీడియోల్లో నిజమెంత.అబద్ధమెంత అనేది ఎవరికీ తెలియదు.
కొందరు దయ్యాలు ఉన్నాయా అని విశ్వసిస్తే మరికొందరు మాత్రం లేవని కొట్టిపారేస్తుంటారు.దెయ్యాలు ఉన్నట్టు చూపించే వీడియోలు నిత్యం నెట్టింట హల్ చల్ చేస్తూనే ఉంటాయి.
తాజాగా కూడా ఒక వీడియో అంతర్జాలంలో ప్రత్యక్షమై అందరినీ నివ్వెరపోయేలా చేస్తోంది.జిమ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అందరి గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి.
ఈ వీడియోలో ఎక్సర్సైజ్ చేయడానికి ఒక వ్యక్తి జిమ్‌కు వచ్చినట్టు చూడొచ్చు.ఆ సమయంలో జిమ్‌లో అతడు తప్ప మరెవరూ లేరు.దీంతో హాయిగా ఎక్సర్సైజ్ చేయడం మొదలెట్టాడు.ఇంతలో అక్కడే జిమ్ పరికరాలు వాటంతటవే కదలడం ప్రారంభమయ్యాయి.
ఇవన్నీ గమనించిన సదరు వ్యక్తి.వాటిని అంతగా పట్టించుకోకుండా తన వర్కౌట్ అలాగే కొనసాగించాడు.
కానీ అక్కడి పరిస్థితి మరింత భయానకంగా మారడంతో అక్కడ ఏదైనా అదృశ్య శక్తి ఉందా అని కంగారు పడ్డాడు.ఇక అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్న సమయంలో అతడు ఒక్కసారిగా కిందపడ్డాడు.
ఏం జరిగిందో తెలుసుకునే లేపే హటాత్తుగా అతడి కాళ్లను ఒక అదృశ్యశక్తి పట్టుకొని లాక్కెళ్లింది.దీంతో ఒక్కసారిగా జడుసుకున్న సదరు వ్యక్తి ఉరుకులు పరుగులు పెట్టాడు.

ఈ వీడియోని టిక్‌టాక్ యూజర్ @carlosruizoficial షేర్ చేశారు.ఇది క్షణాల్లోనే వైరల్ గా మారింది.ఇప్పటి వరకు దీనికి 12 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.కొందరు దెయ్యాలు లేవని.వీడియో మొత్తం కల్పితమేనని కామెంట్స్ చేస్తున్నారు.
మరికొందరు మాత్రం చాలా భయానకంగా ఉందని హడలిపోతున్నారు.