వైరల్ వీడియో: వీరికి ఏమైనా పోయేకాలం దగ్గరకు వచ్చిందా..?!

ప్రస్తుత యువత సోషల్ మీడియా వినియోగం చాలా ఎక్కువ అయిపోయింది.రాత్రికి రాత్రే స్టార్స్ అయిపోవాలని అనేక ప్రయత్నాలు చేయడంతో పాటు, వింత విన్యాసాలు చేస్తూ ఆ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం ద్వారా స్టార్స్ అయిపోవాలని ప్రయత్నాలు చేసుకుంటున్నారు.

 Viral Video Is It Time For Them To Go Anyway, Railways Issued , Warning, Youngst-TeluguStop.com

మరి కొంతమంది అయితే ఎత్తయిన పర్వతాలు, కొండలు ఎక్కి వాటిపై వివిధ స్టిల్స్ దిగడం, లేదా ఎత్తయిన జలపాతంల మధ్య నిలబడి ఫోటోలు తీసుకోవడం తదితరవి షేర్ చేసి స్టార్స్ అయిపోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

తాజాగా కొంతమంది యువకులు చేసిన వింత సాహసానికి కటకటాలపాలు అవాల్సి వచ్చింది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.ముంబై నగరంలో దాదాపు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతున్న ఒక రైల్ లోని కొంతమంది యువకులు వింత విన్యాసాలకు పాల్పడ్డారు.

రైలు డోర్ వద్ద నిలబడి బయటకు వేలాడుతూ, రైలు పట్టాల పక్కన ఉన్న ఎలక్ట్రిక్ పోల్స్ ను  పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.ఎలక్ట్రికల్ పోల్ వచ్చిన సమయంలో పూర్తిస్థాయిలో బయటకు వేలాడుతూ దాన్ని ముట్టుకోవడానికి ప్రయత్నాలు చేశారు.

అదే సమయంలో ఈ రిస్కీ టాస్క్ లో వీడియోను ఫోన్ లో బంధించి, అవి కాస్త సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.ఆ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లగా పోలీసులు కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.

యువకులు రిస్కీ స్టంట్స్ చేస్తున్న సమయంలో తోటి ప్రయాణికులు వద్దని ప్రాణాలకే ముప్పు అని ఎన్నిసార్లు చెప్పినా ఆ యువకులు మాత్రం వారి మాటలను పట్టించుకోలేదు.

పోలీసుల దృష్టికి వెళ్లిన ఈ వీడియో క్షుణ్నంగా పరిశీలించి కేసు నమోదు చేసి ఆ యువకుల కోసం గాలింపు చేస్తున్నామని త్వరలోనే వారిని పట్టుకొని తగిన శిక్ష విధిస్తామని ముంబై పోలీసులు తెలియజేశారు.

యువతపై రైల్వే చట్టాలను అతిక్రమించిన అందుకుగాను ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారు.ఎవరైనా సరే ఇలాంటి రిస్కీ స్టంట్స్ చేస్తే ప్రాణాలకే ప్రమాదం అంటూ పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube