వైరల్ వీడియో : 12 వేల అడుగుల ఎత్తు నుంచి కింద పడిన ఐఫోన్..కానీ చివరికి..!?

ప్రస్తుత రోజుల్లో ప్రతి చిన్న పిల్లవాడి నుంచి పెద్దవారి వరకు స్మార్ట్ ఫోన్ వినియోగం చాలా ఎక్కువ అయ్యింది.స్మార్ట్ ఫోన్ వీడియో సమయంలో సడన్ గా ఫోన్ కింద పడిపోవడం లాంటి సందర్భాలు చాలానే చూస్తుంటాం.

 12000 Height, Skydriver, Shocking, Viral Video, Viral Latest, Social Media, Smar-TeluguStop.com

అలాంటి సమయంలో స్క్రీన్ పగిలిపోవడం, స్పీకర్స్ పనిచేయకపోవడం, టచ్ స్క్రీన్ పని చేయకపోవడం లాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి.ఇలా జరిగిన సమయంలో కొత్త ఫోన్ తీసుకోవాలని కొందరు అనుకుంటూ ఉంటే, మరికొందరు అయితే స్క్రీన్ గార్డ్ మారిస్తే సరిపోతుంది అని అనుకుంటూ ఉంటారు.

అయితే కొన్ని వేల అడుగుల ఎత్తు నుంచి కిందకు పడిపోయిన అనంతరం కూడా ఐ ఫోన్ పని చేస్తుంది అంటే వినడానికే చాలా విడ్డూరంగా అనిపించినా ఇది నిజం.

కోడీ మాడ్రో అనే స్కై డ్రైవర్ 12 వేల అడుగు ఎత్తులో ఉన్న సమయంలో అతడి జేబులో నుంచి ఐ ఫోన్ కింద పడిపోయింది.

ఇకపోతే ఈ కథనాన్ని మొత్తం అతనితోపాటు స్కై డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి వీడియోను తన ఫోన్ లో బంధించాడు.ముందుగా అతని జేబులో నుంచి ఏదో వస్తువు కింద పడిపోయింది అని అనుకున్నారు.

అనంతరం ఫోన్ జారిపోయింది ఐ ఫోన్ అని తెలిసి షాక్ కు గురయ్యారు.

అనంతరం అతడు డ్రైవింగ్ పూర్తయిన అనంతరం కిందకు వచ్చాక తన ఫోన్ కోసం వెతకడం మొదలు పెట్టాడు.అందులో భాగంగానే సమయానికి ఫోన్ దొరికింది.కానీ ఫోన్ స్క్రీన్ మాత్రం పగిలిపోయింది.

అయితే టచ్ తో పాటు ఫోన్ మొత్తం కూడా బాగా పని చేస్తుండడంతో అతను ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేయగా అది కాస్తా బాగా వైరల్ గా మారింది.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube