సింహం బేసిగ్గా అడవిలో మిగతా జంతువుల మీద పెత్తనం చెలాయించడం మనం చూస్తూవుంటాం.అయితే అలాంటి అలాంటి సంహాలకు ఎదురు తిరిగే కొన్ని జంతువులు కూడా ఉంటాయి.
వాస్తవానికి ఏనుగుపై సింహం చాలా అరుదుగా దాడి చేస్తుంది.దానికి కారణం ఏనుగు భారీకాయం.
అలాగే నక్కలు, తోడేళ్ళును కూడా సింహం బేసిగ్గా కెలకడానికి ఇష్టపడదు.సింహం గర్జన వింటేనే అడవి మొత్తం దద్దరిల్లినా ఈ జంతువులు మాత్రం అస్సలు వణకవు.
ఈ సంగతి చాలా రొటీన్ కదా.అయితే, వీటికంటే బలహీనమైన కుక్కలు కూడా అప్పుడప్పుడు సింహాలకు చుక్కలు చూపిస్తాయి.
బేసిగ్గా గ్రామ సింహానికి అంటే శునకానికి వున్న ధైర్యం దేనికీ ఉండదంటే అతిశయోక్తి కాదు.తన ఎదురుగా ఎంతటి బాహుబలులున్నా కుక్కలు మాత్రం వణకవు, బెరకవు.అవును.ఆ ధైర్యం వాటికి మాత్రమే సొంతం.
సదరు వీడియోలో అదే మనకు కనిపిస్తుంది.ఏకంగా 2 సింహాలకు సస్సు పోయించింది ఇక్కడి కుక్క.
దీనికి సంబంధించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అడవిలోని మైదాన ప్రాంతంలో రెండు సింహాలు ప్రశాంతంగా పడుకుని వున్నాయి.
ఆ పక్కనే జీబ్రాల గుంపు కూడా వుంది.ఇంతలో సడెన్ గా ఓ కుక్క నేరుగా సింహాల వద్దకు వచ్చి, ఆ సింహాల ముందు నిల్చుని గట్టిగా మొరగడం మొదలుపెట్టింది.
ఆ సౌండ్ కి సింహాలు జడుసుకుని పైకి లేస్తాయి.కుక్కపై దాడి చేసేందుకు సింహాలు ఉరుకుతాయి.ఆ కుక్క తక్కువ తిందా.మరింత దూకుడుతో రివర్స్ అటాక్ చేసింది.వాటిని ఎగిరి మరీ తన కాలితో తన్నింది.ఇక కుక్క అరుపులకు రెండు సింహాలు బెదిరిపోయాయి.
కుక్క కనబరిచిన సాహసానికి బిత్తరపోయిన సింహాలు.అక్కడి నుంచి పరుగులు తీశాయి.
ఈ వీడియో IPS అధికారి సుశాంత నంద తన ట్విట్టర్లో షేర్ చేయగా.ఆ వీడియో కాస్తా తెగ వైరల్ అవుతోంది.
ప్రస్తుతం లక్షల్లో ఆ వీడియో చూస్తున్నారు.మీరు కూడా ఓ లుక్కేయండి.