సృజన తిన్నవార... సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ సృజన ఎవరు? ఆమె కథ ఏంటీ?

కొన్ని వారాలుగా సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా కూడా సృజన అనే పేరు వినిపిస్తుంది.ఈ పేరు గురించి కొందరికి తెలుసు, కొందరికి తెలియదు.

 Viral Video In Social Media-TeluguStop.com

ఈ సృజన అనే పేరుతో వస్తున్న వీడియోలు మరియు మీమ్స్‌ను జనాలు బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు.కొందరు అయితే తమ బండ్లపై సృజన తిన్నావరా అంటూ టాటూలు వేయించుకోవడం కూడా మనం చూస్తున్నాం.

ఒక వ్యక్తి సృజన నన్ను వదిలేస్తున్నావా అంటా అంటూ చెప్పుతున్న డైలాగ్‌కు డీజే మిక్స్‌ చేసి రచ్చ రచ్చగా సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ చేస్తున్నారు.ముఖ్యంగా టిక్‌టాక్‌లో కోట్లాది వీడియోలు సృజన పేరుతో వస్తున్నాయి.

ఇంతకు ఈ సృజన ఎవరు, ఆమె కథ ఏంటీ అనేది ఇప్పుడు కాస్త లోతుగా వెళ్లి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.సృజన పేరుతో కొందరు కావాలని వాయిస్‌ క్రియేట్‌ చేశారని మొదట భావించారు.

అయితే సృజన మరియు ఆమె లవర్‌ మాట్లాడుకున్న మాటలు ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతున్నాయి.దాదాపు అర్థగంట పాటు సృజన మరియు ఆమె లవర్‌ ఫోన్‌లో మాట్లాడుకున్నారు.

ఆ మాటలే ఇప్పుడు సృజన వీడియోలకు వాయిస్‌ అవుతున్నాయి.ఆ వాయిస్‌కు డీజే మిక్స్‌ చేశారు.

ఇంతకు ఆ ఫోన్‌ కాల్‌ లో ఏం మాట్లాడుకున్నారంటే… నాలుగు నెలలు సృజన మరియు అతడు కలిసి తిరిగారు, ప్రేమించుకున్నారు.అయితే అతడి పద్దతి, అనుమానం నచ్చక పోవడంతో అతడికి దూరంగా ఉండాలని సృజన భావించింది.

అయితే అతడు మాత్రం ఆమెను వదలేందుకు ఇష్టపడలేదు.అతడిని దూరం పెట్టుతున్న నేపథ్యంలో తాగాడో లేదో కాని ఒక రోజు కాల్‌ చేశాడు.

ఆ సమయంలోనే సృజనతో అర్థగంట మాట్లాడాడు.బండ బూతులు తిడుతూ నువ్వు వేరే వారితో తిరుగుతున్నావు, అయినా కూడా నువ్వు నాకు కావాలి రా పెళ్లి చేసుకుందాం అన్నాడు.

కాని ఆమె మాత్రం నాకు వద్దు, నీతో జరిగింది చాలు అంటూ బ్రేకప్‌ చెప్పేసింది.అతడి మాటల్లో నిజాయితీ ప్రేమ కనిపిస్తుంటే, ఆమె మాటల్లో కూడా నిజాయితీ ఉందనిపిస్తుంది.

ఆమె మరెవ్వరితో ట్రాక్‌ నడిపి ఉండదని అంతా భావిస్తున్నారు.సృజన ఫోన్‌ రికార్డింగ్‌ ఇప్పుడు యూట్యూబ్‌లో లక్షల వ్యూస్‌ను దక్కించుకుంటుంది.

బూతులు ఎక్కువ ఉన్నా కూడా కొందరు ఆ వాయిస్‌ విని ఎంజాయ్‌ చేస్తుంటే మరి కొందరు పాపం అంటున్నారు.మొత్తానికి సృజన మాత్రం సోషల్‌ మీడియాను కుదిపేస్తోంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube