వైర‌ల్ వీడియో.. ఈ ఏనుగు ఫీట్ చూస్తే వావ్ అంటారంతే..

నిజానికి అడవికి రాజు సింహం అంటారు గానీ.కొన్ని సార్లు ఆ సింహాన్ని కూడా గ‌జ‌రాజు ఒక్క‌డే త‌రిమి కొట్ట‌డం మనం చూస్తున్నాం.

 Viral Video If You Watch This Elephant Feat You Will Say Wow Details, Viral Vide-TeluguStop.com

అడ‌విలోనే అత్యంత భారీ ఆకారం క‌లిగిన ఏనుగులు అంటే ఎవ‌రికైనా చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది.ఏనుగులు చేసే ప‌నుల‌కు సంబంధించిన న్యూస్ నిత్యం మ‌న‌కు సోష‌ల్ మీడియాలో క‌నిపిస్తూనే ఉంటుంది.

ఏనుగులు చూడ‌టానికి భ‌యంక‌రంగా ఉంటాయి గానీ అవి చేసే ప‌నులు మాత్రం చిన్న‌పిల్ల‌ల్లాగే అనిస్తుంది.అందుకేనేమో వాటిని చిన్న పిల్ల‌లు అంత‌లా ఇష్ట‌ప‌డుతారు.

ఇక ఏనుగు పిల్ల‌ల గురించి అయితే ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

ఇక ఏనుగుల కోపం గురించి కూడా ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

వాటికి కోపం వ‌స్తే మాత్రం ప్రాణాలు తీసేదాక వ‌దిలిపెట్ట‌వు.వాటి బీభ‌త్సం ముందు ఎంత ప్ర‌మాద‌క‌ర జంతువు అయినా ప్రాణాలు కోల్పోవాల్సిందే.

మొన్న‌టికి మొన్న ఓ కొల‌నులో మొస‌లిని ఏనుగు ఎలా తొక్కి చంపిందో చూస్తేనే ఈ విష‌యం అర్థం అవుతుంది.అయితే ఇప్పుడు మాత్రం ఓ ఏనుగు త‌న ప‌నితో అంద‌రినీ షాక్ చేసేసింది.

ఇలాంటి పీట్ కూడా చేస్తుందా అనేలా త‌న‌లోని ప్ర‌తిభ‌ను బ‌య‌ట పెట్టేసింది.మైసూర్ ప‌ట్ట‌ణంలోని నాగర్‌ హోళే ఫారెస్ట్‌ రిజర్వ్‌లో ఈ ఏనుగు ఘ‌ట‌న జ‌రిగింది.

నాగరహోళే టైగర్ రిజర్వ్ డైరెక్టర్ మహేష్ ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను క్లియ‌ర్ గా వివ‌రించారు.ఈ వైర‌ల్ వీడియోలో చూస్తే ఇందులో ఓ ఏనుగు త‌న‌కు అడ్డుగా ఉన్న ఓ ఇనుప కంచెలాంటి నిర్మాణాన్ని అమాంతం దూకేసి మ‌రీ దాటుతుంది.త‌న‌కు ఏదీ అడ్డు కాద‌న్న‌ట్టు అద్భుత‌మైన ఫీట్ తో దాన్ని దాటేయ‌డం మ‌నం చూడొచ్చు.ఇదంతా అక్క‌డున్న సీసీ కెమెరాల్లో రికార్డు కావ‌డంతో దాన్ని సుప్రియా సాహు నెట్టింట పోస్టు చేయ‌గా విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.

దాన్ని చూసిన వారంతా ఏనుగు తెలివితేటలను ఫిదా అయిపోతున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube