వైరల్ వీడియో: ఆ క్యాచ్ పట్టుంటే మాత్రం చరిత్రలో ఇట్లే నిలిచిపోయేవాడు.. కానీ..?!

క్రికెట్ అంటే మనలో చాలా మందికి ఇష్టం.అందులో ముఖ్యంగా ఐపిఎల్ అంటే ఇంకా చాలా మందికి ఇష్టం.

 Viral Video If You Catch That, It Will Stay In History But, Viral Latest Viral N-TeluguStop.com

ఇకపోతే ప్రస్తుతం బిగ్‌బాష్‌ హవా నడుస్తోంది.ఈ లీగ్‌లో చాలా మంది తమ ప్రతిభకు పదును పెడుతున్నారు.

తాజాగా జరిగిన మ్యాచ్ లో ఓ అద్భుత సీన్ చోటుచేసుకుంది.హరికేన్‌ హోబర్ట్స్‌ క్రికెటర్ విల్‌ పార్కర్‌ అద్బుతమైన క్యాచ్ ను పట్టుకున్నాడు.

కానీ అది సిక్స్ అయిపోయింది.బౌండరీ లైన్‌పై స్టన్నింగ్‌ క్యాచ్‌ పట్టి అందర్నీ ఔరా అనిపించాడు.

అయితే బౌండరీ లైన్‌ టచ్ చేయడం వల్ల అంపైర్లు దానిని సిక్స్‌ గా తెలిపారు.ఒకవేళ పార్కర్‌ బౌండరీ లైన్‌ తాకకుండా క్యాచ్‌ పట్టుకుని ఉండుంటే రికార్డు నెలకొల్పేవాడు.

చరిత్ర రాసేవాడు.హోబర్ట్‌ హరికేన్స్‌, అడిలైడ్‌ స్ట్రైకర్స్‌ మధ్య మ్యాచ్‌లో ఇటువంటి సంఘటన జరిగింది.

మ్యాచ్ లో 13వ ఓవర్‌ జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.ఆ ఓవర్లోని మూడో బాల్ ను మాట్‌ షార్ట్‌ లాంగాన్‌ దిశగా బాదాడు.ఆ భారీ షాట్ కు అక్కడే ఉన్నటువంటి పార్కర్‌ పరిగెత్తుకొచ్చాడు.ఆ తర్వాత విల్లులా వంగిపోయి డైవ్‌ చేశాడు.

ఆ డైవ్ లోని ఒకే చేత్తో స్టన్నింగ్‌ క్యాచ్‌ పట్టుకుని అందర్నీ ఆశ్చర్యపరిచాడు.అయితే ఆ సమయంలో బౌండరీ లైన్‌ ను తాకడంతో పార్కర్‌ ఏం చేయలేక ఆ బాల్ ను దూరంగా విసరగలిగాడు.

రూల్‌ ప్రకారంగా చూస్తే అంపైర్లు దానిని సిక్సుగా ప్రకటించడంతో పార్కర్‌ విన్యాసం వృథా అయిపోయింది.ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఈ మ్యాచ్‌లో అడిలైడ్‌ స్ట్రైకర్స్‌ 22 రన్స్ తో విజయం సాధించింది.అయితే పార్కర్ క్యాచ్ పట్టిన విధానం మాత్రం అందర్నీ ఆశ్చర్యపరిచింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ క్యాచ్ వీడియో వైరల్ అవుతోంది.

Viral Video If You Catch That, It Will Stay In History But, Viral Latest Viral News, Catch, Sports Update, History - Telugu Latest #Shorts

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube