వైరల్ వీడియో: యాక్సిడెంట్ లో గాల్లో పల్టీలు కొట్టిన భార్యభర్తలు..!

రోజురోజుకూ ప్రమాదాలు పెరిగిపోతున్నాయి.రోడ్డు ప్రమాదాలు పెరిగిపోవడం వలన చాలా మంది ప్రాణాలు వదులుతున్నారు.

 Viral Video: Husbands Who Flipped In The Gall In An Accident, Viral Latest, Vira-TeluguStop.com

ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్సిడెంట్లు జరిగిన వీడియోలు దర్శనమిస్తున్నాయి.తాజాగా అలాంటి సంఘటనే ఒకటి చోటుచేసుకుంది.

ప్రమాదం జరిగిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.థానేలోని షాహాపూర్ సమీపంలో ఆగ్రా రోడ్డులోని కోర్టు ముందు కారు, బైక్ లు ఢీకొడంతో ప్రమాదం చోటుచేసుకుంది.

ఈ ప్రమాదంలో ఇద్దరు భార్యా భర్తలు తీవ్రంగా గాయాలపాలయ్యారు.గాయపడిన వారిని చికిత్స నిమిత్తం షాహాపూర్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం గాయాలపాలైన వారిన ఆరోగ్యం నిలకడగా ఉంది.ఇటువంటి ఘోర ప్రమాదం సీసీటీవీలో రికార్డు కావడంతో ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

థానే జిల్లాలోని షాహాపూర్‌ ఆగ్రా రోడ్డు వద్ద అసంగావ్ వైపు ఓ కారు వెళుతుండగా నేరుగా వచ్చిన ఓ బైక్ కారును ఢీకొంది.

రోడ్డు మార్గం కూడా చాలా చిన్నదిగా ఉండటం వల్ల ఇరువైపులా రెండు కార్లు వెళ్లాయి.ఆ సమయంలో వెనకవైపు నుంచి కారు వస్తుండగా దాని వెనకాలే మరో బైక్ వచ్చింది.ఆ బైక్ సరాసరి ఎదురుగా వస్తున్న కారును ఢీకొంది.

అప్పటికే బైక్ స్పీడ్ గా వస్తుండటం వలన ఎదురు వస్తున్న కారును ఢీకొంది.దీంతో కారులోని ఇద్దరు రెండు పల్టీలు వేసి కింద పడ్డారు.

కారు డ్రైవర్ సడన్ గా బ్రేక్ వేయడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది.అయితే బైక్ స్పీడ్ గా రావడం వలన అది కారును ఢీకొట్టింది.

ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తి తీవ్రంగా గాయాలపాలయ్యాడు.బైక్ నడుపుతున్న వ్యక్తి రోడ్డుపై పడిపోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో రోడ్డుపై వెళ్తున్నవారు ఆయన్ని లేపి ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube