వైరల్ వీడియో: బురదలో పడిన భర్త.. ఆనందంలో భార్య.. చివరికి.?

బురద నేలలో నడవాలంటే చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి.ఎందుకంటే మనం వేసే అడుగు అటు ఇటు జారిన బురదలో పడిపోయే అవకాశాలు చాలానే ఉన్నాయి.

 Viral Video Husband Martin Fall In Mud In Maldives Wife Happy, Viral Video,viral-TeluguStop.com

అయితే బురదలో నడిచే వాళ్ళకి అలవాటు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆచితూచి అడుగులు వేస్తారు.అదే అలవాటు లేని వాళ్ళు అయితే తప్పకుండా పడిపోతారు.

ఎందుకంటే బురదకి జారే స్వభావం కలిగి ఉంటుంది కాబట్టి.అయితే ఇప్పుడు ఒక వ్యక్తి కూడా చూసుకోకుండా బురదలో కాలు వేయడంతో అమాంతం బురద గుంటలోకి పడిపోయాడు.

అయితే భర్త బురదలో పడడం చూసిన ఏ భార్య అయినఏమి చేస్తుంది చెప్పండి.అయ్యయ్యో అని భర్తని లేపి దెబ్బలు ఎమన్నా తగిలాయా అండి, బట్టలు అన్నీ పాడయిపోయాయి కదా కొంచెం చూసుకుని నడవవచ్చు కదా అని అంటుంది అని మనం అనుకుంటాము.

కానీ.ఈ వీడియోలో అందుకు భిన్నంగా పడిపోయిన భర్తను చూసి పకా పకా మంటూ నవ్వింది.

దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే ఈ వీడియోను చూసిన వారు నవ్వకుండా అసలు ఉండలేరు.

అయితే అసలు ఇంతకీ ఆ బురదలో పడిన వ్యక్తి ఎవరు.ఎందుకు బురదలోకి వెళ్ళాడు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రిటిష్‌ దేశానికీ సంబందించిన మార్టిన్ అనే వ్యక్తి టూరిజం కోసం అని తన భార్య రచెల్‌ తో కలిసి మాల్దీవులలో పర్యటించడానికి వెళ్ళాడు.అయితే మాల్దీవులలో వ్యూవాములా అనే ప్రాంతం ఉంది.

అక్కడ రోడ్డు మీద ప్రయాణం చేసేకంటే వేరే మార్గంలో వెళితే త్వరగా మనం అనుకున్న చోటుకు వెళ్ళవచ్చు అని అతని భార్య మార్టిన్ కు సలహా ఇచ్చింది.అయితే వారు వెళ్లే మార్గంలో బురద కూడా ఉంది.

ఆ బురదను దాటుకుని వాళ్ళు వెళ్ళాలి.ఈ క్రమంలో అతడు వేసుకున్న చెప్పులు తీసేసి ఆ చెప్పులను చేతితో పట్టుకుని, ప్యాంటు తడవకుండా, బురద కూడా అంటకుండా ఉండేలా ప్యాంటును పైకి మడిచాడు.

Telugu British, Martin, Latest, Ruchell-Latest News - Telugu

అన్ని జాగ్రత్తలు తీసుకుని కాలు బురదలో వేసాడు.ఇంకేముంది మొదటి అడుగుతోనే బురద గుంటలో పడిపోయాడు.అయితే బురదలో పడిన తరువాత మార్టిన్ కొన్ని సెకన్ల వరకు కనిపించలేదు.అలా తన భర్త మార్టిన్ బురదలో పడిపోతే అతడి భార్య అలా చూస్తుండిపోతూ, అతనిని బయటకు లాగే ప్రయత్నం చేయకుండా ఎంచక్కా వీడియో తీస్తూ కిలకిల మంటూ నవ్వుతూనే ఉంది.

అలా భార్య నవ్వడంతో మార్టిన్ కు కోపం వచ్చి “‘నాతో అసలు మాట్లాడకు ” అని భార్యతో గట్టిగా అరిచి చెప్పాడు.

ఈ వీడియోను మార్టిన్ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌ లో షేర్‌ చేశాడు.

ఈ వీడియోతో పాటు మార్టిన్ ఇలా చెప్పుకొచ్చారు.ప్రస్తుతం ‘మేము మాల్దీవుల పర్యటనలో ఉన్నాము.

ఈ క్రమంలో నా భార్య మరోవైపుకు వెళ్లేందుకు దగ్గరి దారి ఉందని బురద దారి వైపు తీసుకెళ్లింది.

Telugu British, Martin, Latest, Ruchell-Latest News - Telugu

అక్కడికి చెప్పులు తీసేసి చాలా జాగ్రత్తగా బురదలో అడుగు వేసా కానీ., నేను బురదలో ఉన్న గోతిలోకి వెళ్లిపోయాను.బురదలోకి పూర్తిగా మునిగిపోవడంతో అసలు ఎక్కడున్నా నేను అనే షాక్‌ లోకి వెళ్ళిపోయా.

ఆ బురద గుంట 9 – 10 అడుగుల లోతులో ఉంది.ఆ గుంటలో పడినా కానీ నేను భయపడకుండా వెంటనే నీటి నుంచి బయటకొచ్చాను.

నా అవస్థ చూసి నా భార్య 10 నిమిషాల వరకు ఆపకుండా నవ్వుతూనే ఉంది.నేను కోపంతో అరిచాను.

తర్వాత నా బట్టలు అన్ని పాడయిపోవడంతో పక్కనే ఉన్న సముద్రం దగ్గరకు దుస్తులను శుభ్రం చేసుకున్న అని తన అనుభవాలను వీడియోతో పాటు షేర్ చేసాడు మార్టిన్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube