వైరల్ వీడియో: ఈ కోతి తెలివితేటల ముందు మనుషులు కూడా పనికిరారు.. దీని టాలెంట్ చూస్తే ఆశ్చర్యపోతారు..

కోతి నుంచి మనిషి పుట్టాడని అంటుంటారు.కోతులు పరిణామం చెంది మనుషులుగా మారాయని చెబుతుంటారు.

 Viral Video Humans Didn T Work Before This Monkey S Intelligence Wondering It-TeluguStop.com

అయితే కోతులు మనుషుల్లాగా ప్రవర్తిస్తూ సంభ్రమాశ్చర్యాలకు గురి చేయడం మనం  ఇప్పటికే ఎన్నోసార్లు చూశాం.ప్రస్తుతం, కోతికి  సంబంధించిన అలాంటి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

ఈ వీడియోలో కోతి కనబరచిన తెలివితేటలు చూస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు.ఈ వీడియోలో కోతి మానవుడిలా చాలా సులభంగా ఓ పజిల్‌ను ఛేదిస్తుంది.

ఈ పజిల్ సాల్వ్ చేయాలంటే కాస్త బుర్ర పెట్టి ఆలోచించాల్సి ఉంటుంది.ఈ పజిల్ సాల్వ్ చేసే మొదటి ప్రయత్నంలో ఏ మానవుడైనా సరే ఫెయిల్ అవ్వడం ఖాయమట.

అటువంటి క్లిష్టమైన పజిల్ ని ఈ కోతి సెకండ్ల నిడివిలో అలవోకగా, ప‌ర్‌ఫెక్ట్‌గా పూర్తిచేసి ఆశ్చర్యపరుస్తోంది.

వైరల్ అవుతున్న వీడియో క్లిప్‌లో అడవిలో చెక్క తలుపులో చెక్కలతో ఏర్పాటు చేసిన ఒక పజిల్ చూడొచ్చు.

ఇదే సమయంలో ఆ పజిల్ చుట్టూ చాలా కోతులు కనిపిస్తాయి.ఈ చెక్క తలుపు మీద ఒక కోతి ఏదో చేస్తూ కనిపించింది.

మరుసటి క్షణంలో తలుపులో దాగి ఉన్న ఒక పజిల్ ని కోతి పరిష్కరించడం గమనించొచ్చు.ఈ పజిల్ ఏంటంటే పైన ఒక చెక్కలో యాపిల్ లేదా ఏదైనా గుండ్రటి పండు ఉంటుంది.

దాన్ని కిందకి తీసుకొస్తే పజిల్ సాల్వ్ చేసినట్లే.అయితే ఆ పండు అనేది చాలా చెక్కలను దాటుకుని గజిబిజి మార్గాల ద్వారా కిందకి రావాలి.

అలా చేయాలంటే చెక్క తలుపుకు ఇరువైపులా సెట్ చేసిన అనేక చట్రాలను తిప్పాల్సి ఉంటుంది.సరైన సమయంలో ఏదైనా చట్రాన్ని సరిగా తప్పుగా తిప్పితే ఆ పండు అనేది మళ్ళీ పైకి వెళ్లిపోతుంది.

అందుకే చాలా జాగ్రత్తగా ఎలాంటి తప్పులు చేయకుండా ఈ పజిల్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది.అయితే కోతి మాత్రం సులభంగా ఈ పజిల్ సాల్వ్ చేసి యాపిల్ పండు గెలుచుకుంది.

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో మంకీవిడ్జ్ అనే ఖాతా షేర్ చేసింది.‘వావ్, ఇది చాలా తెలివైనది’ అని మంకీవిడ్జ్ అకౌంట్ ఓ క్యాప్షన్‌ జోడించింది.కాగా ఇది ఇప్పుడు వైరల్ గా మారింది.వీడియోను చూసిన నెటిజన్లు దానిపై రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.ఒక వినియోగదారు వ్యాఖ్యానిస్తూ, ‘ఇది సూపర్ ఇంటెలిజెంట్‌గా మారింది’ అని పేర్కొన్నాడు.‘ఓ మై గాడ్’, స్మార్ట్ మంకీ అంటూ పేట నెటిజన్లు వీడియోపై స్పందిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube