వైరల్ వీడియో: కొండ అంచున బస్సును యూ టర్న్ చేసిన డ్రైవర్..!

ప్రపంచంలో ఎంత ప్రమాదకరమైన రోడ్లపై నైనా వాహనాలను నడపగల టాలెంటెడ్ డ్రైవర్లు ఉంటారు.ఇరుకు రోడ్లలో, కొండలలో, లోయలలో ఇలా చెప్పుకుంటూ పోతే ఎటువంటి ప్రదేశంలో నైనా వాహనాలను నడపగలిగే డ్రైవర్లను, వారి సాహస చర్యలను చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది.

 Hrtc Bus Driver Incredible U Turn On Cliff Edge, Shocking Bus, Viral Video, Soci-TeluguStop.com

భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్ లో కూడా అత్యంత భయంకరమైన ఘాట్ రోడ్లు ఉన్నాయి.అక్కడి డ్రైవర్లు ఎత్తైన కొండలపై ఇరుకు రహదారులపై ప్రయాణిస్తుంటారు.

అయితే హిమాచల్ ప్రదేశ్ లో కొద్ది నెలల క్రితం కుండపోత వర్షాలు కురవడంతో కొండచరియల పై ఉన్న రహదారులు బాగా దెబ్బతిన్నాయి.

ఈ నేపథ్యంలోనే కొందరు మినీ బస్ వేసుకొని కొండపై ఉన్న కిలాంగ్-కిల్లర్ రహదారి మీదుగా వెళ్లాలి అనుకున్నారు.

కానీ మార్గమధ్యంలోకి రాగానే కొండపై ఉన్న రహదారి వరదలకు బాగా కొట్టుకుపోయిన ఈ విషయాన్ని డ్రైవర్ గమనించాడు.దీంతో ముందుకు పోయే దారి బాగోలేక పోవడంతో తిరిగి వెళ్ళాలి అనుకున్నారు కానీ రహదారి చాలా చిన్నగా ఉంది.

రివర్స్ గేర్ లో కొంత దూరం వెళ్లొచ్చు కానీ అది ప్రాణాలకే ప్రమాదం.అందుకే బస్సు ని తిప్పి ఇంటి బాట పట్టాలని డ్రైవర్ అనుకున్నాడు.

సింగిల్ రోడ్డు అంత వెడల్పు మాత్రమే ఉన్న ఆ రహదారిపై బస్సు ని రివర్స్ చేసి తిప్పలనుకున్నాడు.

నిజానికి ఆ బస్సు 50 మీటర్ల ఎత్తులో ఉంది.ఏ మాత్రం తప్పు చేసినా బస్సు మరియు డ్రైవరు లోయలో పడిపోవడం ఖాయం.కానీ ఆ డ్రైవర్ రహదారిని పరీక్షించి బస్సు ని నెమ్మదిగా వెనక్కి పోనిస్తూ.

విజయవంతంగా తిప్పగలిగాడు.అయితే బస్సు తిప్పుతున్నంత సేపు అక్కడే ఉన్న స్థానికులు ఈ వీడియోని చిత్రీకరించారు.

బస్సు టైర్లు కొండ అంచుల తాకుతుంటే వీడియో చిత్రీకరిస్తున్న స్థానికులు తీవ్ర ఉత్కంఠ తో చూశారు.నాలుగు నిమిషాల పాటు సాగిన ఈ సాహసోపేతమైన ఫీట్ అందర్నీ ఫిదా చేసేసింది.

ఈ వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం తో తెగ వైరల్ అయింది.జులై 18వ తేదీన యూట్యూబ్ లో అప్లోడ్ అయిన ఈ వీడియోని డిసెంబర్ 16వ తేదీన ఇంక్రిడిబుల్ హిమాచల్ ప్రదేశ్ అనే ఫేసుబుక్ పేజీలో పోస్ట్ చేశారు.

దీంతో ఉత్కంఠ రేపే ఈ వీడియో మళ్లీ వైరల్ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube