వైరల్ వీడియో: ఈ ఏనుగు క్రికెట్​ ఎంతబాగ ఆడుతుందో కదా..?!

ప్రస్తుతం ప్రపంచంలో ఏ మూలన ఏ విషయం జరిగిన సోషల్ మీడియా వేదికగా ఆ వార్త ఇట్లే ప్రజలందరికీ తెలిసిపోతోంది.ఇందులో భాగంగా ఎన్నో రకాల ఫోటోలు, వీడియోలు వైరల్ అవ్వడం మనం గమనిస్తూనే ఉంటాం.

 Viral Video How Well Does This Elephant Play Cricket-TeluguStop.com

ఇందులో ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు, ఆడియోలు ఎక్కువగా వైరల్ అవ్వడం గమనిస్తూనే ఉంటాం.తాజాగా ఒక ఏనుగుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

ఈ వీడియోలో ఏనుగు క్రికెట్ ఆడటం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే.

 Viral Video How Well Does This Elephant Play Cricket-వైరల్ వీడియో: ఈ ఏనుగు క్రికెట్​ ఎంతబాగ ఆడుతుందో కదా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మనుషులు క్రికెట్ ఆడడం మనకు సర్వసాధారణమైన విషయం.కాకపోతే అదే ఆట ఇప్పుడు ఏనుగు ఆడటం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ట్విట్టర్ వేదికన తెగ వైరల్ గా మారింది.వైరల్ గా మారిన వీడియోలో ఓ గజరాజు తన తొండంతో కర్ర పట్టుకుని క్రికెట్ ఆడుతున్న డన్ నెటిజెన్స్ ను ఆశ్చర్యపరుస్తోంది.

గజరాజు తొండంతో ఒక కర్రను పట్టుకొని వుండగా కొంతమంది వ్యక్తులు బాల్ వేస్తుండగా తొండంతో కర్రను తీసుకొని బంతిని నలువైపుల బాదడం ఉండడం మనం గమనించవచ్చు.అయితే ఈ వీడియో ఎక్కడ, ఎప్పుడు తీసారు అన్న విషయం మాత్రం ఇంకా తెలియలేదు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియోకు నెటిజన్స్ ఫిదా అయిపోతున్నారు.పెద్ద ఎత్తున నెటిజెన్స్ ఈ వీడియోకు కామెంట్స్ చేస్తున్నారు.అందులో కొందరు నెటిజన్స్ ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ ఆటగాళ్ల కంటే ఈ ఏనుగు చాలా బాగా ఆడుతోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇక ఇక సోషల్ మీడియాలో ఎప్పుడు చురుకుగా ఉండే ఇంగ్లాండ్ మాజీ ఆటగాడైన మైకెల్ వాన్ ఈ వీడియోను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేస్తూ కచ్చితంగా ఈ ఏనుగుకు ఇంగ్లీష్ పాస్పోర్ట్ ఉంది అంటూ ట్వీట్ చేసాడు.

అయితే వాన్ చేసిన ట్వీట్ పై నెటిజన్స్ కాస్త వెటకారం గానే స్పందిస్తున్నారు.ఇందులో భాగంగానే కొంతమంది ఇంగ్లీష్ క్రికెటర్లకు కంటే ఈ ఏనుగు చాలా బాగా క్రికెట్ ఆడుతున్నాడు నెటిజెన్స్ మైకెల్ వాన్ చేసిన ట్వీట్ పై సెటైర్లు వేస్తున్నారు.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియో ని చూడండి.

#Elephant #Cricket #Viral Video #Playing

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు