వైరల్ వీడియో: పంత్ సెంచరీ చేస్తే కోహ్లీ ఎంత ఆనందపడ్డాడో..!

రిషబ్ పంత్.ప్రస్తుతం టెస్ట్ క్రికెట్ లో రిషబ్ పంత్ తన హవా కొనసాగిస్తున్నాడు.

 Viral Video How Happy Kohli Was When Pant Scored A Century-TeluguStop.com

గత టెస్ట్ సిరీస్ ఆస్ట్రేలియా లో ఆస్ట్రేలియా తో భాగంగా తనదైన శైలిని చూపిస్తూ అద్భుతమైన ప్రదర్శన చేశాడు.ఇందులోభాగంగానే రిషబ్ పంత్ రెండు ఇన్నింగ్స్ లో సెంచరీ చివరి దాకా వచ్చి అత్యుత్సాహంతో 90 పరుగుల కు పైన అవుట్ అయిన సంగతి మనం చూసిందే.

దీంతో తృటిలో రెండుసార్లు సెంచరీ చేసే అవకాశాన్ని రిషబ్ పంత్ కోల్పోయాడు.అయితే ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లాండ్ సిరీస్ లో భాగంగా పంత్ తనదైన మార్కును చూపిస్తూ ముందుకు సాగుతున్నాడు.

 Viral Video How Happy Kohli Was When Pant Scored A Century-వైరల్ వీడియో: పంత్ సెంచరీ చేస్తే కోహ్లీ ఎంత ఆనందపడ్డాడో..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇందులో భాగంగానే నాలుగో టెస్టు రెండో రోజున రిషబ్ పంత్ తనదైన శైలిలో రెచ్చిపోయి సెంచరీని సాధించాడు.ఈ నేపథ్యంలో రెండోరోజు 118 బంతుల్లో 13 బౌండరీలు, రెండు సిక్సర్ల సహాయంతో 101 పరుగులతో ఎట్టకేలకు తన నాలుగో సెంచరీని నమోదు చేయగలిగాడు.

ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ పంత్ సెంచరీ చేసిన సమయంలో సైలెంట్ గా ఆల్రౌండర్ హార్థిక్ పాండ్యా తో ఏదో చర్చిస్తుందగా రిషబ్ పంత్ సిక్సర్ తో సెంచరీ సాధించడంతో ఏమీ ఆలోచించకుండా పైన ఉన్న విరాట్ కోహ్లీ త్వరత్వరగా కిందికి వచ్చి అతడిని చప్పట్లతో అభినందించాడు.ఆ సమయంలో కోహ్లీ చాలా ఆనందపడ్డాడు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోని చూడండి.ప్రస్తుతం టీమిండియా మూడో రోజు ఆటలో కొనసాగింపుగా సమాచారం అందేసరికి 101 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 321 పరుగుల తో మ్యాచ్ కొనసాగుతోంది.ప్రస్తుతానికి మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా 116 పరుగుల లీడ్ కొనసాగుతోంది.

#Viral Video #IndiaVs #Sports Updates #Virat Kohili #Century

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు