వైరల్ వీడియో: చాక్లెట్ రోబో ఎంత బాగుంది కదా..!

ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు వారి ప్రతిభను చాటి చెప్పేందుకు సోషల్ మీడియాను తెగ వాడేసుకుంటున్నారు.టాలెంట్ ఏదైనా సరే వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా ఖండాంతరాలు దాటి ఈ ప్రపంచం మొత్తం వారి గురించి తెలిసిపోతుంది.

 Viral Video How Good Is The Chocolate Robot-TeluguStop.com

ఇందులో ముఖ్యంగా ఎవరి టాలెంట్ ను వారు నిరూపించడానికి కొత్త కొత్త ప్రయత్నాలు చేసి అందరి కంటే భిన్నంగా కనిపించాలని కొత్త వాటిని సృష్టించి ప్రపంచానికి పరిచయం చేస్తుంటారు.ఇక అసలు విషయంలోకి వెళితే.

ఈ మధ్య కాలంలో కొన్ని బేకరీ ఐటమ్స్ సంబంధించి కొత్తగా, వివిధ రకాలుగా తయారు చేస్తూ వార్తల్లో నిలిచిన వ్యక్తులను మనం గమనిస్తూనే ఉన్నాం.ఇటీవల కాలంలో ఓ కేక్ ను అచ్చం అమెజాన్ నుండి పార్సెల్ వచ్చిన విధంగానే తయారుచేసి వార్తల్లో నిలిచారు.

 Viral Video How Good Is The Chocolate Robot-వైరల్ వీడియో: చాక్లెట్ రోబో ఎంత బాగుంది కదా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతేకాకుండా వివిధ కళాకృతులను పూర్తిగా తినే పదార్థాలతో తయారు చేసి వాటిని ప్రజలకు అందజేస్తున్నారు.ఇందులో భాగంగా చాక్లెట్ తో అనేక ప్రయోగాలు చేస్తూ వివిధ ఆకృతులను రూపొందిస్తున్నారు కొంతమంది చెఫ్స్.

ఇదివరకు కాలంలో మోటార్ సైకిల్, డ్రాగన్ లాంటి వివిధ ఆకృతులతో చాక్లెట్ తో తయారు చేసిన పదార్థాలను ప్రపంచానికి పరిచయం చేశారు.ఇక తాజాగా చాక్లెట్ తో ఓ రోబోను తయారు చేశారు.

ఇందుకు సంబంధించిన ఓ వీడియోను దాన్ని సృష్టించిన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది.

ఈ చాక్లెట్ రోబో అచ్చం వంట చేస్తున్నట్లుగా కనబడుతుంది.

చాక్లెట్ రోబో ను సృష్టించడానికి పూర్తిగా చాక్లెట్ నే వాడడం విశేషం.ఇందుకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ ” చాక్లెట్ రోబో చెఫ్.

నా కొత్త సహాయకుడిని కలవండి” అని పోస్ట్ చేశారు.ఈ రోబో చాక్లెట్ చూడటానికి అచ్చం వంట చేసే విధంగా కనబడుతుంది.

ఈ రోబో చాక్లెట్లు తయారు చేయడానికి ఒక పదార్థాన్ని విడివిడిగా తయారు చేసి ఆ తర్వాత వాటిని ఒక దానికి ఒకటి అమర్చి చివరకు రోబో ఆకారాన్ని సృష్టించారు.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ చాక్లెట్ రోబో యొక్క వీడియోను చూసేయండి.

#Chocolate Robo #Social Media #Viral Video

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు