వైర‌ల్ వీడియోః అంత పెద్ద గుడ్డును అలా తినేశాడేంటి..!

కుకరీ చానల్స్‌ను ప్రజెంట్ మస్తు మంది లైక్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే రోజుకో కొత్త కుకురీ యూ‌ట్యూబ్ చానల్ వస్తుండటం మనం గమనించొచ్చు.

 Viral Video How Did He Eat Such A Big Egg,  Big Egg, Man Eats, Ostrich Egg, Omle-TeluguStop.com

రకరకాల న్యూ రెసిపీస్‌తో పాటు వంటకాలపై స్పెషల్ వీడియోలను రూపొందించి సబ్ స్క్రిప్షన్స్‌ను రోజురోజుకూ పెంచుకుంటున్నారు యూట్యూబర్స్.తాజాగా ఓ కుకరీ చానల్‌కు సంబందించిన వెరైటీ రెసిపీ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

నెటిజన్ల చేత విశేష ఆదరణ పొందుతున్న ఆ వీడియోలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే.

సాధారణం కోడి గుడ్లు ఎంత సైజులో ఉంటాయో మనందరికీ తెలుసు.

ఆ గుడ్డును ఉడకబెట్టడంతో పాటు ఆమ్లెట్ చేసుకుని తినడానికి చాలా మంది ఇష్టపడుతారు.అయితే, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న వీడియో‌లో అతిపెద్ద గుడ్డును డిఫరెంట్‌గా వండుకున్నాడు ఓ వ్యక్తి.

ఆ పనిని నార్వే దేశానికి చెందిన వ్యక్తి చేశాడు.ఎత్తైన పక్షి ఆస్ట్రిచ్ గుడ్డునొకటి తీసుకుని ఆమ్లెట్‌లా వండుకుని తినేశాడు.

సదరు గుడ్డు నార్మల్ గుడ్డు కంటే సైజ్‌లో చాలా పెద్దగా ఉంది.దీని బరువు కూడా చాలా ఎక్కువగా ఉన్నట్లు చూస్తేనే తెలుస్తుంది.

ఇకపోతే ఆస్ట్రిచ్ పక్షి దాని గుడ్లను అత్యంత సురక్షితమైన ప్రదేశాల్లోనే దాచిపెట్టుకుంది.అవి తీసుకోవడం చాలా కష్టం.

కానీ, ఈ హంటర్ చాలా కష్టపడే ఈ గుడ్డును సంపాదించాడు.అడవిలో తీవ్రమైన వేట సాగించి అరుదైన గుడ్డును తన సొంతం చేసుకున్నాడు.

ఇక ఈ గుడ్డును పగులగొట్టి నార్మల్ పాన్‌పైనే ఆమ్లెట్ మాదిరిగా చేశాడు.ఇందులో ఉప్పుకారం, మసాలా వేసి బాగా వేడి చేశాడు.ఆ తర్వాత దానికి బ్రెడ్స్ యాడ్ చేసుకుని హ్యాపీగా ఆరగించాడు.ఇదంతా కూడా రికార్డు చేసి ఆ వ్యక్తి ‘ఫైర్ కిచెన్’ యూట్యూబ్ కుకరీ చానల్‌లో అప్‌లోడ్ చేశాడు.

ఆ వీడియో చూసి నెటిజన్లు తెగ సంబురపడుతన్నారు.వామ్మో ఇంత పెద్ద గుడ్డును తాము ఎప్పుడూ చూడలేదని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

హీట్ బర్డ్ ఎగ్ తినడంలో హ్యూమన్ బాడీలో హీట్ విపరీతంగా పెరుగుతుందని మరికొందరు పోస్టులు పెడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube