వైరల్ వీడియో: ఐపీఎల్ కోసం జోస్ బట్లర్ కి కూతురు ఎలా సహాయం చేస్తుందంటే..?!

ఐపీఎల్ 14వ సీజన్ ఏప్రిల్ 9న బయో బబుల్ వాతావరణంలో ప్రేక్షకులు లేకుండా మొదలు కాబోతుంది.ప్రస్తుతం భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ అధిక మోతాదులో ఉండడంతో బీసీసీఐ తో పాటు ఐపీఎల్ పాలకమండలి కూడా అనేక నియమ నిబంధనలు పాటిస్తూ ఎప్పటికప్పుడు ఆటగాళ్లకు కరోనా పరీక్షలు చేయిస్తూ వారిని ప్రాక్టీస్ కు అనుమతి ఇస్తుంది.

 Viral Video How Can Daughter Help Jose Butler For Ipl, Viral Video, Viral News,-TeluguStop.com

ఇప్పటికే ఐపీఎల్ లో పాల్గొనే అనేక మంది ఫారన్ ప్లేయర్లు భారతదేశానికి వచ్చి వారి క్వారంటైన్ సమయాన్ని పూర్తిచేసుకుని మిగతా ఆటగాళ్లతో కలిసి ప్రాక్టీస్ మొదలు పెట్టారు.ఇక అసలు విషయంలోకి వెళ్తే.

ఇటీవల టీమిండియా, ఇంగ్లాండ్ జట్టుతో కలిసి టెస్ట్, t20, వన్డే మ్యాచ్ ల సిరీస్ ను పూర్తి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.ఇక ఇంగ్లాండ్ కెప్టెన్ బట్లర్ విషయానికొస్తే.

తన హోటల్ గదిలో తన కుటుంబంతో పాటు నివసిస్తున్నాడు.ప్రస్తుతం తన క్వారంటైన్ సమయం కారణంగా అతడు హోటల్ గదికి పరిమితమై గది లోనే వర్కవుట్ చేయడం మొదలు పెట్టేసాడు.

అయితే బట్లర్ ఒక్కడు మాత్రమే కాకుండా తన కూతురు జార్జియా కూడా సహాయం చేస్తున్నట్లు కనబడుతోంది.ఇందుకు సంబంధించి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

ఈ వీడియోలో బట్లర్ తన కూతురితో కలిసి పుషప్స్ అలాగే వివిధ వర్కౌట్స్ చేయడం కనబడుతుంది.తండ్రి చేసే వ్యాయామాలు చూసి కూతురు కూడా తన తండ్రిని అనుసరించడం ఈ వీడియోలో అందరిని ఆకర్షిస్తుంది.

ఈ క్యూట్ వీడియోని రాజస్థాన్ రాయల్స్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.ఇకపోతే రాజస్థాన్ రాయల్స్ తరఫున ఓపెనర్ గా బట్లర్, బెన్ స్టోక్స్ ఓపెనర్ల రాబోతున్నట్లు ఇదివరకే తెలిపిన సంగతి అందరికీ తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube