వైరల్ వీడియో: ఏటీఎం నుంచి డబ్బును విత్ డ్రా ఇలా చేయాలా ఏంటి..?!

ఏటీఎంలో డబ్బులు డ్రా చేయడం కామనే.అయితే ఆ డబ్బులను డ్రా చేసే విధానమే కొంత మందికి వెరైటీ అనిపిస్తుంది.

 Hilarious Way Of Women Withdrawing Cash From Atm, Viral Video, Viral News, Viral-TeluguStop.com

తాజాగా ఇలా వెరైటీగా డబ్బులను డ్రా చేసిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.సోషల్ మీడియాలో ఈ మధ్య చాలా మంది అనేక రకాల వీడియోలను పెడుతూ తెగ వైరల్ చేసేస్తున్నారు.

ఇప్పుడు ఈ వీడియో కూడా నెటిజన్లను తెగ అట్రాక్ట్ చేస్తోంది.ఓ ఏటీఎం సెంటర్‌కు వెళ్లిన ఓ అమ్మాయి చేసిన వెరైటీ డ్యాన్స్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సాధారణంగా ఏటీఎం మిషన్‌ నుండి డబ్బు డ్రా చేయాలంటే ఏటీఎం కార్డు ఉండాలి.ఏటిఎంకు సంబంధించి పిన్‌ నెంబర్‌ తెలిసుండాలి.

ఇక ఏటీఎం సెంటర్‌లో క్యూ లైన్‌ ఉంటే మన టర్న్ కోసం వేచి చూడాలి.ఒకవేళ క్యూ లేదంటే డైరెక్టుగా వెళ్లొచ్చు.

కార్డ్‌ సాయంతో పిన్‌నెంబర్‌ టైప్‌ చేసి నగదు విత్‌డ్రా చేసుకుంటారు.కానీ, ఈ అమ్మాయి మాత్రం నగదు డ్రా చేసుకునేందుకు ఇలా వెరైటీగా ట్రై చేసింది.

ఏటిఎంకు వెళ్లిన ఆ అమ్మాయి తన స్టెప్పులతో అందర్నీ ఆకట్టుకుంది.ఏటీఎం వాడింది మొదలు నెంబర్‌ టైప్‌ చేయటం, నగదు బయటకు వచ్చే వరకు ఒక్కో దశలో ఒక్కో విధంగా డ్యాన్స్‌ స్టెప్పులు వేస్తూ అందర్నీ ఆశ్చర్యపరిచింది.

చివరకు డ్రా చేసిన డబ్బు తీసుకుని హ్యాపీగా వెళ్లిపోయింది.ఇక ఆ అమ్మాయి చేసిన డ్యాన్స్ అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు అయింది.ఈ వీడియోను ఐపీఎస్‌ అధికారి దీపాన్షు కబ్రా తన ట్విట్టర్‌లో షేర్ చేశారు.కాగా, ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఏటీఎం నుంచి డబ్బును ఇలా కూడా విత్ డ్రా చేయొచ్చా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.ప్రస్తుతం ఇలా డ్యాన్స్ వేసిన వీడియోను చూసి అందరూ తెగ నవ్వుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube