వైరల్ వీడియో: శునకానికి చుక్కలు చూపించిన కోడి..!

చాలా మంది కార్టూన్లు ఛానెల్స్ ని చూస్తూ ఉంటారు.కార్టూన్ ఛానెల్ లో వచ్చే టామ్ అండ్ జెర్రీలను ఎక్కువగా ఇష్టపడుతుంటారు.

 Viral Video Hen Chasing The Dog In A Funny Way , Viral Video, Viral Latest, Soci-TeluguStop.com

టామ్ జెర్రీలో ఎలుక వెనక పిల్లి పరుగెత్తడం చూస్తుంటాము.ప్రతిసారీ ఎలుకే గెలుస్తుండటం మనకు నచ్చుతుంది.

అయితే నిజ జీవితంలో మాత్రం అలాంటివి జరగవు.అయితే టామ్ అండ్ జెర్రీలాగే కోడి, కుక్క కూడా దాగుడు మూతలు ఆడుతున్నాయి.

కోడి చూడటానికి లావుగా ఉంది.కోడిని చూసిన కుక్క మాత్రం దానిని ఎప్పడు తిందామా అన్నట్లు చూస్తుంది.

అది గమనించిన కోడి కుక్కను తరిమింది.లావుగా ఉన్న ఆ కోడి ఆ కుక్కను తరమడం ఓ జోక్.ఈ ఛేజింగ్‌లో రెండూ అలసిపోతున్నాయి.ఫాస్ట్‌గా పరుగెత్తడం వాటి వల్ల కావట్లేదు.ఐతే… ఎట్టి పరిస్థితుల్లో కోడికి దొరకకూడదని అని కుక్క ఫిక్స్ అవ్వగా… ఎలాగైనా కుక్కను పట్టుకోవాలి అని కోడి ఫిక్సైంది.ఇక వాటి పరుగు పందెం దాడుగు మూతల ఆటలా తయారైంది.

అందుకే ఈ వీడియో వైరల్ అయ్యింది.

అయితే సాధారణంగా వైరల్ వీడియోలు కొన్ని సెకండ్లే ఉంటాయి.ఇది ఏకంగా నిమిషం ఉంది.చూసేకొద్దీ ఫన్ జనరేట్ అవుతూనే ఉంది.

ఇప్పటికే ఈ వీడియోని 44 లక్షల మంది చూశారు.ఆ లిస్టులో మనమూ ఉంటాం.

వీడియోని ఇక్కడ చూడండి.ట్విట్టర్ యూజర్ స్ట్రిక్ట్‌లీ క్రిస్టో ట్వీట్ చేసిన ఈ వీడియోని గమనిస్తే.ఓ పార్కులో ఆ కోడి, కుక్క సరదాగా ఛేజ్ చేసుకుంటున్న విషయం మనకు అర్థం అవుతుంది.నిజమే… అవి రెండూ ఫ్రెండ్స్.కాకపోతే.మరీ ఇంత సరదాగా ఎప్పుడూ లేవు.అందుకే ఈ సరదా ఛేజింగ్ వైరల్ అయ్యింది.

ఇక ఈ ఛేజింగ్ గేముల్లో ఇదే బెస్ట్ అని స్ట్రిక్ట్‌లీ ఈ వీడియోకి కాప్షన్ ఇవ్వగా… ఇది చాలా బాగుంది అని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

లైక్స్, షేర్స్ పెరుగుతూనే ఉన్నాయి.ఇది ఆస్కార్‌లో షార్ట్ ఫిల్మ్ కేటగిరీకి గెలవకపోతే… ఆస్కార్ తప్పే అని ఓ యూజర్ కామెంట్ రాయగా… ఇది రియల్ లైఫ్ కార్టూన్‌లా ఉందని మరొకరు రాశారు.

చక్కగా ఆనందం కలిగించే వీడియో అని మరో యూజర్ తెలపగా… ఇలాంటిదే మరో వీడియోని నెటిజన్లు చూపిస్తున్నారు.ఇందులో ఓ గోరింక రకరకాలుగా మాట్లాడుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube